తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్‌కి సంబంధించి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిన కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మోనాల్, తెలుగు నేర్చుకుంటోంది.. తెలుగులో మాట్లాడేందుకు చాలా చాలా (Abijeet Monal Gajjar Akhil Triangle Love Story) ప్రయత్నిస్తోంది.
ఈ సీజన్‌కి సంబంధించి మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున అందరికీ గుర్తుకొచ్చే పేరు కూడా మోనాల్ గజ్జర్‌దే. కానీ, షోలో ఎంటర్ అయినప్పటినుంచీ.. అందరికంటే ఎక్కువగా ఏడ్చింది మోనాల్ గజ్జర్ మాత్రమే. ఇక, ఈ సీజన్‌కి సంబంధించినంతవరకు ఏదో ‘లవ్ ట్రాక్’ నడిచి తీరాల్సిందేనన్నట్లుగా బిగ్ బాస్ బృందం ఓ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పైగా, దాన్ని ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ అని ఇప్పటికే బిగ్‌బాస్ కన్‌ఫాం కూడా చేసేశాడు. నాగ్ కూడా అదే మాట పలు సందర్భాల్లో చెప్పాడు కూడా. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వున్న అఖిల్, మోనాల్, అబిజీత్. నిజానికి, హౌస్‌లో ఆ పరిస్థితి వుందా? అంటే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.
కానీ, ఏదో వుందనే భ్రమ కల్పిస్తున్నారు. తద్వారా షోకి ఎక్స్‌ట్రా మైలేజ్ తేవాలనే ఆలోచన వుండి వుండొచ్చు నిర్వాహకులకి. కానీ, ఈ గందరగోళం కారణంగా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తమ ఆటని పాడు చేసుకుంటున్నారు.
ఎంత ఫోకస్డ్‌గా అబిజీత్, అఖిల్ వుంటున్నా.. మోనాల్ విషయమై హోస్ట్ నాగార్జున వ్యవహరిస్తున్న తీరు, సీన్‌లోకి అబిజీత్, అఖిల్ పేర్లను తెస్తున్న వైనం.. ఇవన్నీ మొత్తంగా ముగ్గురి ఆట తీరునీ దెబ్బ తీసేస్తున్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.
హౌస్‌లోకి అబిజీత్ ఎంటర్ అయ్యే ముందు స్టేజ్ మీద నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, మోనాల్‌ని పెళ్ళి చేసుకుంటానన్నాడు. అదేదో జస్ట్ ఓ సరదా సందర్భం. కానీ, హౌస్‌లో అతనికి మోనాల్ గజ్జర్ నిజంగానే ఎదురయ్యింది.
ప్రతి రోజూ, ప్రతి వారం ఈ ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ (Abijeet Monal Gajjar Akhil Triangle Love Story) అనే నస భరించడం కూడా కష్టమయిపోతోంది బిగ్ బాస్ ఫాలోవర్స్‌కి. ఈ వీకెండ్‌లో కూడా ఓ ‘నస’ కార్యక్రమమే నడిచింది. మధ్యలో దివిని కూడా లాగారు. ఆమె, మేటర్‌ని క్లియర్ చేసేసింది. కానీ, ఈ క్రమంలో దివి.. ఆ ముగ్గురి ఫాలోవర్స్‌కీ టార్గెట్ అయిపోతోంది.