హీరోయిన్ మోనాల్ గజ్జర్ (Monal Gajjar Akhil Sarthak Abijeet BB4 Telugu), బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు ఓ వరుడ్ని వెతుక్కోవడానికి వచ్చిందా.? కేవలం ‘లవ్ స్టోరీ’ కోసమే ఆమెను బిగ్‌హౌస్‌లోకి నిర్వాహకులు తీసుకున్నారా.? అబిజీత్, అఖిల్ సార్ధక్‌లలో ఎవరో ఒకర్ని మోనాల్ గజ్జర్ పెళ్ళి చేసుకోవడం ఖాయమేనా.? ఇలాంటి ప్రశ్నలు చాలానే తెరపైకొస్తున్నాయి.
అసలు ఇది రియాల్టీ షోనా.? లేదంటే, పెళ్ళిళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్వయంవరం షోనా.? అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి. మొదట్లో అబిజీత్, మోనాల్ గజ్జర్ మధ్య ‘ట్రాక్’ నడిచింది. మధ్యలోకి అఖిల్ సార్దక్ వచ్చాడు. అబిజీత్, మోనాల్ గజ్జర్‌ని లైట్ తీసుకున్నాడు.
అఖిల్ సార్ధక్‌కి దగ్గరయ్యింది మోనాల్ గజ్జర్. అఖిల్‌తో మోనాల్ (Monal Gajjar) క్లోజ్‌గా మూవ్ అవుతుండడాన్ని అబిజీత్ జీర్ణించుకోలేకపోతున్నాడని కొన్నాళ్ళు.. మోనాల్, అబిజీత్‌తో మాట్లాడుతోంటే అఖిల్‌కి ఒళ్ళు మండిపోతోందని ఇంకొన్నాళ్ళు సోషల్ మీడియాలో చర్చ నడిచింది. లవ్ స్టోరీ లేదు.. తొక్కా లేదు.. మొత్తం మేటర్‌ని ఈ ముగ్గురి మధ్యా తిప్పుతూ బిగ్‌బాస్ రేటింగ్స్‌ని పెంచుతున్నారనే అభిప్రాయాలు బలపడ్డాయి.
ఇంతలోనే మోనాల్ కోసం అబిజీత్ (Abijeet), అఖిల్ సార్థక్ (Akhil Sarthak) కొట్టుకుంటున్నట్లు ఇంకో ఎపిసోడ్ తెరపైకొచ్చింది. బిగ్‌హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్స్ వున్నారు. కొత్తగా కొందరు వచ్చారు, కొందరు ఎలిమినేట్ అయ్యారు కూడా. స్వాతి దీక్షిత్ విషయంలోనూ కొంచెం ‘గ్లామరస్ టచ్’ కనిపించింది. ఆ తర్వాత అది తుస్సుమంది.
బిగ్‌హౌస్‌లో మరో గ్లామరస్ ఫేస్ అలేఖ్య హారిక (Alekhya Harika). ఆమె ప్రస్తుతం అబిజీత్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోంది. మొదట్లో ఆమెకీ అఖిల్ సార్థక్‌కీ కనెక్షన్ బాగానే సెట్ అయ్యింది. అబిజీత్ ఫన్నీగా అందరితోనూ లవ్ ప్రపోజల్స్ చేసేస్తున్నాడు. దీన్నంతటినీ ఓ ‘యాక్టింగ్ షో’లా చూడాలే తప్ప, ఎవరి క్యారెక్టర్ ఏంటి.? అని జడ్జ్ చేసేయడానికి వీల్లేదు.
గత సీజన్‌లో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ ఇలాగే కథ నడిచింది. చివరికి ఏమయ్యిందో అంతా చూశాం. తాజా నామినేషన్స్ ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ ఆవేదన వెనుక అర్థం వుంది. దేశమంతా చూస్తోన్న ఈ రియాల్టీ షోలో తనను ఆటవస్తువుగా ఇద్దరు కంటెస్టెంట్స్ మార్చేయడాన్ని మోనాల్ జీర్ణించుకోలేకపోయింది.
కాగా, మోనాల్ (Monal Gajjar Akhil Sarthak Abijeet BB4 Telugu) పక్కా ప్లాన్‌తో అబిజీత్‌నీ, అఖిల్‌నీ తనవైపుకు తిప్పుకుని ‘ఆట’ ఆడేస్తోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. కానీ, ఇది జస్ట్ ఓ రియాల్టీ షో.. అని అంతా గుర్తు పెట్టుకుంటే మంచిదేమో.