Begging On Bike.. సీ..సీ.. సమాజం సానా పాడైపోనాది.! లేకపోతే ఏటి.! ఓ పెద్దాయన, ఫాఫం నడవలేని స్థితిలో ఓ బైక్ మీద వెళ్ళి బిచ్చమెత్తుకుంటున్నాడట.! అంతే, ఈ విషయం వైరల్ అయి కూర్చుంది.!
బైకు మీద ఓ మైకు సెట్టు పెట్టుకున్నాడు.. అందులోంచి ‘బాబూ ధర్మం..’ అంటూ మాటలొస్తున్నాయ్. తప్పేముంది.? అరవలేని పరిస్థితి.. నడవలేని దుస్థితి.!
కష్టపడి పని చేసుకునే పరిస్థితీ లేదు.. కడుపు నింపుకోడానికి వేరే దారీ లేదు.. దాంతో, ఆయన అలా చేస్తున్నాడేమో.!
రాజకీయ నాయకుల్తో పోల్చితేనో.!
ఖరీదైన కార్లేసుకుని.. హెలికాప్టర్లలో తిరుగుతూ రాజకీయ నాయకులు ఓట్లడుక్కుంటారు. వాళ్ళతో పోల్చితే, బతుకు పోరాటంలో బిచ్చమెత్తుకోడానికి ఫాఫం ఆ పెద్దాయన బైకు మీద వెళ్ళడం తప్పెలా అవుతంది.?
రాజకీయ నాయకుల్లా ఆ పెద్దాయన ఎవర్నీ మోసం చేయట్లేదు. తన దయనీయ స్థితిని ఎవరన్నా అర్థం చేసుకుని సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తుంటాడంతే.!
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయ్.! బైకులో పెట్రోలు కొట్టించేంత సంపాదించేస్త్నాడంటే.. అతను బిచ్చగాడెలా అవుతాడన్నది ఓ ప్రశ్న.
Begging On Bike.. పెద్దాయన దోచుకోవట్లేదుగా.!
అబ్బో, ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయ్.! వస్తాయ్ కూడా.! నచ్చితే పదో, పరకో సాయం చేయొచ్చు. లేదంటే, లైట్ తీసుకోవచ్చు.
రాజకీయ నాయకులు దోపిడీ చేస్తోంటే నిలదీయలేని సోకాల్డ్ జనం.. ఇదిగో, ఇలాంటి బిచ్చగాళ్ళ మీద మాత్రం చెలరేగిపోతుంటారు.! పాపిష్టి కాలం. అతే మరి.!
Also Read: అంబాసిడర్ కారుకి ఆ రాజసం మళ్ళీ దక్కేనా.?
చివరగా.. ఎవరూ నొచ్చుకోవద్దని మనవి.! ఎవర్నీ ఉద్దేశించి కాదండోయ్.! కాస్త సరదాకి, జనంలో కాస్త ప్రశ్నించేతత్వం పెరగడానికి.!
అన్నట్టు, ఇప్పుడు హెలికాప్టర్లలోనూ, ఖరీదైన లగ్జరీ కార్లలోనూ తిరిగే రాజకీయ నాయకులూ.. ఎన్నికలొస్తే, ఈ బైక్ బెగ్గర్ దగ్గరకి ఓట్లడుక్కోడానికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.