Table of Contents
Betting Apps Are Syamala.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల యెదుట విచారణకు హాజరయ్యారు వైసీపీ అధికార ప్రతినిథి, యాంకర్ శ్యామల.!
గతంలో ఓ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన దరిమిలా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ శ్యామల ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
Betting Apps Are Syamala.. అనఫీషియల్ అంటే..
పోలీసుల యెదుట విచారణకు హాజరైన శ్యామల, మీడియాతో మాట్లాడారు. ‘కోర్టులో వున్న విషయంపై మాట్లాడితే అనఫీషియల్ అవుతుంది’ అంటూ వింత వ్యాఖ్యలు చేశారామె.
కోర్టులో వున్న విషయంపై మాట్లాడితే అనఫీషియల్ అవుతుందా.? అసలు, దానర్థమేంటి.? అంటే, ఏదో కంగారులో పొరపాటు డైలాగ్ వాడేసి వుంటారేమో.! అది వేరే చర్చ.

‘కల్ప్రిట్స్’కి శిక్ష పడాల్సిందేననీ, ఈ క్రమంలో విచారణకు సహకరిస్తాననీ శ్యామల చెప్పడం గమనార్హం. ఇక్కడ అసలు ‘కల్ప్రిట్స్’ అంటే ఎవరు.?
నిస్సందేహంగా, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులే.. వాళ్ళతోపాటు, ఆ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళని కూడా కల్ప్రిట్స్‌గానే చూడాల్సి వుంటుంది కదా.!
అమాయకుల్ని చిదిమేస్తున్నారు..
బెట్టింగ్ యాప్స్ వల్ల లక్షలాది మంది, కోట్లాది మంది అమాయకులు ఆర్థికంగా చితికిపోతున్నారు.. అందులో కొంతమంది బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు.
సో, ఇది కేవలం ఫైనాన్షియల్ క్రైమ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. అన్నమాట.! హత్యా నేరం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం.. కోణంలో కూడా ఈ నేరాల్ని చూడాల్సి వుంటుంది.
సరే, సెలబ్రిటీలు డబ్బుకి కక్కుర్తి పడి.. ఈ యాప్స్‌ని ప్రమోట్ చేసి వుంటారన్నది ఇంకో చర్చ. కానీ, అంత సోయ లేనోళ్ళు అసలు మనుషులే కాదు.!
తమ ఇంట్లో జరిగితే తెలిసేది..
ఎందుకంటే, బెట్టింగ్ ఎంత తీవ్రమైన అంశమో తెలియనంత అమాయకులు కాదు ఏ సెలబ్రిటీ అయినాసరే.! చట్ట పరంగా కొన్ని లూప్ హోల్స్‌తో, బెట్టింగ్ యాప్స్ విచ్చలవిడిగా పుట్టుకొచ్చేశాయ్.
సెలబ్రిటీలు కూడా, అవే లూప్ హోల్స్ తమకు ఉపయోగపడతాయనే భ్రమల్లో వుండి వుంటారు. అందుకే, నిర్లజ్జగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు.
ప్రాణం విలువైనది.. బెట్టింగ్ యాప్స్ వల్ల తమ ఇంట్లోని వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి, బలవన్మరణానికి పాల్పడితే.. అన్న కనీస సోయ వుంటే, ఏ సెలబ్రిటీ కూడా వాటిని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు.