Bhagavanth Kesari Teaser స్లాంగ్.. తెలంగాణ స్లాంగ్.! బాలయ్య నోట.! ఔను, ఆ కిక్కే వేరప్పా.! రాయలసీమ స్లాంగ్ విషయంలో బాలయ్యకు సాటి ఇంకెవరు.! ఇది ఇప్పటి మాట.!
ఇకపై, తెలంగాణ (Telangana) స్లాంగ్ విషయంలో బాలయ్యకు (Nandamuri Balakrishna) సాటి ఇంకెవ్వరు.? అని అంటారేమో.!
నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది.. అంటూ బాలయ్య చెప్పే డైలాగ్.. ‘భగవంత్ కేసరి’ సినిమాకే హైలైట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Bhagavanth Kesari Teaser.. ఆ ఏజ్ ఏంటి.. ఆ గేజ్ ఏంటి.?
బాలయ్య (Nandamuri Balakrishna) రూటే సెపరేటు.! ఈ మధ్య వయసు మళ్ళిన పాత్రల్లోనూ తనదైన స్టయిల్లో మెప్పిస్తున్నారు.
బాలయ్య చేతికి దర్శకు అనిల్ రావిపూడి ఇచ్చిన ఆయుధం, బాలయ్య పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన తీరు.. వాట్ నాట్.. ప్రతీదీ వేరే లెవల్.!
డైలాగ్ డెలివరీలో బాలయ్య గురించి కొత్తగా చెప్పేదేముంది.? బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకో లెవల్.. అనుకోవచ్చు ‘భగవంత్ సింగ్’ కేసరిలో.
టీజర్ వరకూ కాజల్ అగర్వాల్, శ్రీలీల పాత్రలకు ఛాన్స్ ఇవ్వలేదు.
హిందీలో బాలయ్య చెప్పిన ‘కాన్ భైరీ’ డైలాగ్.. క్షణాల్లో వైరల్ అయిపోయింది.
Mudra369
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Singh Kesari) సినిమాలో, యాభయ్యేళ్ళ వ్యక్తిలా బాలయ్య కనిపిస్తున్నా, ఆయన ఎనర్జీ.. యాజ్ యూజువల్.. జస్ట్ థర్టీస్.. అన్నట్లే వుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఔట్ అండ్ ఔట్.. యాక్షన్ అంతే.!
టీజర్ మొదలైన దగ్గర్నుంచి ముగిసే వరకూ.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఫీల్ కలుగుతుందంటే.. బాలయ్య వైబ్స్ అలా వున్నాయ్ మరి.

నందమూరి బాలకృష్ణ (Happy Birthday Nandamuri Balakrishna) పుట్టినరోజు సందర్భంగా ఈ ‘భగవంత్ కేసరి’ టీజర్‌ని విడుదల చేశారు.
Also Read: Lavanya Tripathi: మెగా కుటుంబంలోకి అందాల రాక్షసి.!
విజయదశమి కానుకగా ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే, దసరా పండక్కి.. అభిమానులకి సంబరాలే సంబరాలన్నమాట.!