Bhagyashri Borse Raviteja.. రవితేజ అంటే మాస్ మహరాజ్.! మినిమమ్ గ్యారంటీ హీరో ఇమేజ్ దాటేసి, బాక్సాఫీస్ మహరాజ్‌గా మారిపోయాడు రవితేజ.!
ఏం లాభం.? వరుస పరాజయాలు రవితేజతో సినిమాలు తీసేవాళ్ళని కలవరపెడుతున్నాయ్. అయినా, రవితేజ నుంచి సినిమాల ప్రవాహమైతే తగ్గట్లేదనుకోండి.. అది వేరే సంగతి.
గత కొంతకాలంగా రవితేజ సినిమాలకు సంబంధించి వినిపిస్తోన్న ‘గ్లామరస్’ ఫిర్యాదు ఏదన్నా వుందంటే, అది ‘హీరోయిన్లు సెట్ కావడంలేదు’ అన్నదే.!
కుర్ర హీరోయిన్లు.. ముసలి హీరో.!
చిరంజీవి, బాలకృష్ణ లాంటోళ్ళకే కాదు, నితిన్ లాంటి యంగ్ హీరోకి కూడా ఈ మధ్య హీరోయిన్ల విషయంలో తలనొప్పి వచ్చి పడింది.
రవితేజ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘నేలటిక్కెట్’ సినిమా విషయంలో మొదలైన పంచాయితీ, ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
మధ్యలో శృతిహాసన్‌తో రవితేజ కాంబో సెట్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ కూడా సూటయ్యింది.!
కానీ, ఈ మధ్య సినిమాల్లో మళ్ళీ రవితేజకి హీరోయిన్లతో పంచాయితీ వచ్చి పడుతోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అస్సలు బాగోవడంలేదు. ఈ మధ్యనే వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలోనూ అంతే.!
మరో కొత్త భామని తీసుకొచ్చారహో..
ఈసారి భాగ్యశ్రీ బోర్సె అనే కొత్త భామని తెలుగు తెరకు తీసుకొస్తున్నారు రవితేజ కోసం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది.

ప్రీ లుక్ పోస్టర్ చూస్తే, ప్చ్.. రవితేజ మారలేదు.. అతనితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలూ మారలేదనిపిస్తోంది.!
మాస్ మహరాజా.. క్లాస్ మహరాణి.. ప్చ్.! ఈ కాంబినేషన్ ఏమవుతుందో ఏమో.!