Bhanushree Mehra Varudu అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడామె గురించిన చర్చ ఎందుకు.!
అసలు విషయమేంటంటే, తనను బన్నీ బ్లాక్ చేశాడంటూ వాపోయింది హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ట్విట్టర్‌లో అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రాని (Bhanushree Mehra) బ్లాక్ చేశాడట. అద్గదీ అసలు సంగతి.
ఏమయ్యిందోగానీ, భానుశ్రీ మెహ్రా ఆరోపణల తర్వాత అల్లు అర్జున్ హ్యాండిల్ నుంచి ఆమెను అన్‌బ్లాక్ చేసేశారు. సో, భానుశ్రీ మెహ్రా ఫుల్ ఖుషీ అయిపోయింది.!

ఇంతలోనే ఎంత మార్పు.? అసలు ఏం జరిగింది.? అల్లు అర్జున్ భయపడ్డాడా.? లేదంటే, పొరపాటున బ్లాక్ చేసి.. తప్పు సరిదిద్దుకుని అన్‌బ్లాక్ చేశారా.?
Bhanushree Mehra Varudu అల్లు అర్జున్‌ని నేనేమీ అన్లేదు..
ఏమోగానీ, తానెప్పుడూ అల్లు అర్జున్ (Allu Arjun) మీద విమర్శలు చేయలేదనీ, ఆయనంటే తనకు చాలా అభిమానమనీ భానుశ్రీ మెహ్రా చెప్పుకొచ్చింది.
అన్నట్టు, గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ పెద్ద డిజాస్టర్. ఆ సినిమాలో తమిళ నటుడు ఆర్య విలన్‌గా నటించాడు. భారీ అంచనాల నడుమ సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) చేతికి గాయమైతే, చేతికి కట్టుతోనే ఓ పాటకి డాన్స్ చేసేశాడు. అప్పట్లో అదో సంచలనం.
Also Read: బాబాయ్.. అబ్బాయ్.! ఒకర్నొకరు తొక్కుకుంటూ పోవాలె.!
ఇదిలా వుంటే, ‘వరుడు’ (Allu Arjun Varudu) సినిమాలోని హీరోయిన్‌ని సినిమా రిలీజ్ సమయం వరకూ రహస్యంగా దాచారు. అప్పట్లో అదో డిఫరెంట్ గేమ్ ప్లాన్. కాకపోతే అది బెడిసికొట్టింది.!
ఇంతకీ బన్నీ (Allu Arjun) నిజంగానే భయపడ్డాడా.? సోషల్ మీడియా వేదికగా ‘వరుడు’ (Varudu) హీరోయిన్ భానుశ్రీ మెహ్రా.. ఎందుకంత యాగీ చేసింది.? ఏమో మరి.!