Bheemla Nayak Sunil: ఏం మాట్లాడుతున్నావ్.! నరాలు కట్ అయిపోయాయ్.! కట్ అయిపోవూ మరి.! ఆ స్థాయిలో సునీల్ మీద పడి ఏడ్చేశారు ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో కొందరు.
‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమాలో నటించి సునీల్ (Comedian Sunil) చాలా పెద్ద తప్పు చేసేశాడట. సునీల్ అంటే ఎవరు.? ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి, హిట్లు కొట్టినోడు. ఇప్పుడేంటి, ఇలా ఓ చిన్న పాటలో కనిపించి మాయమైపోవడం.? చాలా తప్పు.. పెద్ద తప్పు.. అంతేనా, నేరం కూడా.!
Bheemla Nayak Sunil ఔనా, సునీల్ అంత పెద్ద తప్పు చేసేశావా.?
అయ్ బాబోయ్.! ఇదేంటి నిజంగానే సునీల్ అంత పెద్ద నేరం చేసేశాడా.? పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమాలో, ఓ పాటలో డాన్సు చేస్తే, దాన్ని అంత పెద్ద తప్పిదంగా చూడాలా.? చూడాల్సిందే, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సినిమా. అదంటే, కొందరు బులుగు పచ్చ కామెర్ల గాళ్ళకి అస్సలు గిట్టదు మరి. అద్గదీ అసలు సంగతి.
మెగా ఫ్యాన్.. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం సునీల్. ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిని (Mega Star Chiranjeevi) అభిమానించనివారెవరు.? అభిమానులందు మెగాభిమానులు వేరయా.. ఆ మెగాభిమానుల్లో హార్డ్‌కోర్ అభిమానులు వేరయా.!
చిరంజీవిని (Chiranjeevi) అభిమానించెవాళ్ళెవరైనా పవన్ కళ్యాణ్‌నీ అభిమానిస్తారు. అయితే, ‘కల్ట్ అభిమానులు’ పవన్ కళ్యాణ్‌కి ఇంకాస్త ఎక్కువ. అంతే తేడా.! ఆ కల్ట్ అభిమానులు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవినీ అభిమానిస్తారు.
సునీల్ ఏ రకమైన అభిమాని.. అంటే, ఆయన చిరంజీవికి వీరాభిమాని.. ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలో చాలామందిని అభిమానిస్తాడు.
ఆ కడుపు మంట.. ఆ కిక్కే వేరప్పా.!
సరే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా అనగానే, ఓ చిన్న పాత్రలో అలా కన్పించడమంటే ఆ కిక్కే వేరు. ఆ కిక్కుని సునీల్ ఎంజాయ్ చేసేశాడు ‘భీమ్లానాయక్’ సినిమాలో స్పెషల్‌గానే. అది చాలామందికి గిట్టలేదు. సునీల్ మీద దుష్ప్రచారం మొదలు పెట్టేశారు.
Also Read: తగ్గాడు.. నెగ్గాడు.! అందుకే, చిరంజీవి అందరివాడు.!
కానీ, సునీల్ ఊరుకుంటాడా.? ‘పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నానని మాత్రమే మీకు తెలుసు.. మీకు తెలియనిదేంటంటే.. స్టూల్ కూడా షేర్ చేసుకున్నాను..’ అని సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు.
పైన చూశారుగా.. సునీల్, పవన్ కళ్యాణ్ (Bheemla Nayak Sunil) ఎంత హ్యాపీగా.. మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తూ వున్నారు. ప్చ్.. ఏం చేస్తాం, కడుపు మంట.. అది మామూలు మంట కాదు.. భరించలేని మంటతో విలవిల్లాడిపోతున్నారు హేటర్స్.. ఈ ఫొటో చూసి.
