Bheemla Nayak Trailer Review.. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ చూసినప్పుడే చాలామందికి అందులోని పోలీస్ పాత్రలో తెలుగు సినీ అభిమానులకి పవన్ కళ్యాణ్ కనిపించారంటే, ఆ పాత్రలోని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పోలీస్ పాత్ర మాత్రమే కాదు.. ఆ పోలీస్‌ని ఢీకొట్టే ‘బలుపు’ క్యారెక్టర్ (ప్రతినాయకుడు అనలేంగానీ..) కూడా అంతే పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడం ‘అయ్యప్పనుమ్ కోషియం’ ప్రత్యేకత.
ఆ సినిమా తెలుగులోకి ‘భీమ్లానాయక్’ పేరుతో రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం.. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌పై అంచనాలు పెరిగిపోవడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
Bheemla Nayak Trailer Review.. పవర్ సునామీ.. భీమ్లానాయక్
తాజాగా, ‘భీమ్లానాయక్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ నెల 25న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ‘ట్రైలర్’ ఎలా వుంది.? ఇంకెలా వుంటుంది.. తెరపై రెండు పవర్ హౌస్‌లు ఒకదానితో ఒకటి ఢీకొడుతోంటే ఎలా వుంటుందో.. అలాగే వుంది.
ఆటిట్యూడ్.. విషయంలో పవన్, రానా.. ఇద్దరూ ఎవరికి వారే అన్నట్టు నటించారు. చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ హై ఓల్టేజ్ పవర్‌ని క్రియేట్ చేస్తుంటుంది.
అదిప్పుడు, ప్రత్యర్థి పాత్రని రాణా పోషించడంతో.. పదింతలయ్యింది.. కాదు కాదు, సునామీలా విరుచుకుపడింది.
థియేటర్లలో థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా మార్మోగిపోతుందో.. పవన్, రానా దగ్గుబాటు సృష్టించబోయే సునామీ ఎలా వుండబతోందోగానీ.. ట్రైలర్ చూశాక, చాలాసేపు ఆ ‘పవర్’ని ఫీల్ అవుతూనే వుంటామంటే అతిశయోక్తి కాదేమో.
Also Read: పవ‘నిజం’ శుద్ధ అబద్ధం.. ‘మార్పు’ అసాధ్యం.?
మలయాళ వెర్షన్‌లో హీరోయిన్ పాత్ర పెద్దగా హైలైట్ అవదు. తెలుగులో మాత్రం నిత్యా మీనన్‌కి స్కోప్ ఎక్కువే ఇచ్చినట్లున్నారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’తో పోల్చితే ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak Trailer Review) కోసం చాలా మార్పులే జరిగినట్లు కనిపిస్తోంది.