బిగ్‌బాస్ రియాల్టీ షోకి (Bigg Boss 3 Telugu) సంబంధించి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. లోపల జరిగేదంతా ఫ్యాబ్రికేటెడ్ (Bigg Boss 3 Telugu Elimination) వ్యవహారమేననీ, పేరులో వున్న రియాల్టీ.. హౌస్‌లో వుండదనీ ఆ గాసిప్స్‌ని బట్టి అర్థమవుతోంది. అది నిజమేనా.? అన్నది వేరే చర్చ. బిగ్‌హౌస్‌లోకి (Bigg Boss Telugu Season 3) ఎవరెవరు వెళ్ళబోతున్నారో, షో ప్రారంభానికి ముందే లీకులు బయటకొచ్చేశాయి.
లేటెస్ట్ లీక్ ఏంటంటే, హేమ (Hema), బిగ్ హౌస్ (Bigg House) నుంచి ఔట్ అయిపోబోతోందట. ఆమె స్థానంలో ఓ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్‌ని తీసుకొస్తున్నారట. ఎవరా కంటెస్టెంట్? ఏమా కథ? వివరాల్లోకి వెళితే, హేమ అసలు ఈ రియాల్టీ షో కోసం ముందుగా అనుకున్న కంటెస్టెంటే కాదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ప్రస్తుతం ఎలిమినేషన్ కోసం నలుగురు ఫైనల్ అయ్యారు. అందులోంచి ఒక్కరు మాత్రమే మిగులుతారు. హేమని పక్కన పెడితే రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), వితికా షెరు (Vithika Sheru), జాఫర్ (Jaffar) ఆ మిగతా ముగ్గురు.
చివరి నిమిషంలో హేమని ఎంపిక చేశారనీ, ఆమె స్థానంలో ముందుగానే ఇంకో కంటెస్టెంట్‌ని ఫైనల్ చేసి, రిజర్వ్‌లో పెట్టారనీ తెలుస్తోంది. ఇంతకీ, అలా హైడ్ చేసిన (Bigg Boss 3 Telugu Elimination) ఆ సీక్రెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకలా ఆ కంటెస్టెంట్‌ని హైడ్ చేయాల్సి వచ్చింది.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేముందు.. మొదటగా లీక్ అయిన లిస్ట్‌లో ఆ కంటెస్టెంట్ పేరుందన్న విషయాన్ని ప్రస్తావించుకోవాలి.
ఇక, తొలి వీకెండ్ ఎంటర్‌టైనింగ్ షోని శనివారం సరదాగా స్టార్ట్ చేసిన నాగార్జున (Akkineni Nagarjuna) హౌస్‌లో జరిగిన ఓ గలాటా గురించి మాట్లాడుతూ ‘జెండర్’ అనే అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి, అక్కడ ఆ ప్రస్తావన చేయాల్సిన అవసరమే లేదు. అయితే, అలా ప్రస్తావించడానికి ఇంకో బలమైన కారణం వుందట.
అదేంటంటే, ట్రాన్స్‌జెండర్‌ని హౌస్‌లోకి పంపబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అని ‘ఇన్‌సైడ్ సోర్సెస్’ పేరుతో ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ ట్రాన్స్‌జెండర్‌కి పొలిటికల్ నేపథ్యం వుంది. ‘కాస్టింగ్ కౌచ్’ (Casting Couch) ఆరోపణల్లో ఆ ట్రాన్స్‌జెండర్ పేరు మార్మోగిపోయింది. ఆ ట్రాన్స్‌జెండర్ ఎవరో కాదు, శ్రీరెడ్డితో (Sri Reddy) కలిసి హడావిడి చేసిన తమన్నా సింహాద్రి (Tamannah Simhadri).
షో తొలి రోజునే తమన్నా సింహాద్రిని (Tamanna Simhadri) సీన్‌లోకి దించాలనుకున్నారుగానీ, కొన్ని కారణాలతో పక్కన పెట్టారట. అదెంత నిజమోగానీ, హేమ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవడం ఖాయమట. ఈ క్రమంలో హేమకి నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడని సమాచారమ్.
అయితే, హేమ (Hema) రిక్వెస్ట్‌తో ఆ ‘క్లాస్ తీసుకున్న’ వీడియో చాలా వరకు ఎడిట్ చేయబడిందట. ఒకవేళ పైన చెప్పుకున్నవన్నీ నిజమే అయితే, బిగ్ హౌస్‌లో (Bigg Boss 3 Telugu) అంతా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమే అనుకోవాలేమో.
ఓటింగ్ వ్యవహారమంతా హాట్‌స్టార్, మిస్డ్ కాల్ వంటి ప్రక్రియలతో (Bigg Boss 3 Telugu Elimination) జరుగుతుడడం కారణంగా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ‘బిగ్’ ఫార్మాట్‌లో మరీ అంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా? ఏమో, చెప్పలేం.