బుల్లితెరపై అత్యంత ప్రతిష్టాత్మకమైన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మళ్ళీ వచ్చేసింది. తొలి సీజన్‌ని హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడిపిస్తే, రెండో షోకి నేచురల్ స్టార్ నాని తనదైన సహజత్వాన్ని అద్దాడు. ముచ్చటగా మూడో సీజన్.. సకల హంగులతో సిద్ధమయిపోయింది.. కింగ్ నాగార్జున (Bigg Boss Telugu 3 Nagarjuna) హోస్ట్‌గా.
తన కొత్త సినిమా ‘మన్మథుడు-2’ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళి, అక్కడే బిగ్‌బాస్ ప్రోమోని కూడా ప్లాన్ చేసేసినట్టున్నాడు. బిగ్‌బాస్ గురించి అక్కడినుంచే ఓ డైలాగ్ పేల్చేశాడు.. మనసు కోతిలాంటిదంటూ. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. నాగార్జునకి (Bigg Boss Telugu 3 Nagarjuna) వయసు పెరగడంలేదు, తగ్గిపోతోంది.
అవును మరి, ఆయన్ని చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే.. ఆ స్థాయిలో నాగ్ కుర్రతనం సంతరించేసుకుంటున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పేరు ప్రస్తావించినప్పుడు పెద్ద కొడుకని చెప్పిన నాగార్జున, నానిని (Natural Star Nani) మాత్రం బ్రదర్ అనేశాడు.
బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా నాగార్జున (Bigg Boss Telugu 3 Nagarjuna) చేసిన సందడి అంతా ఇంతా కాదు. హోస్ట్‌గా ఆల్రెడీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని నిర్వహించిన అనుభవం వుండడంతో, నాగార్జునకి బిగ్‌బాస్ కూడా కొట్టిన పిండి లాంటిదేనని అనుకోవచ్చు. స్టేజ్ మీద నాగ్ చలాకీగా కదులుతోంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పార్టిసిపెంట్లకు హగ్గులు.. వారి మీద అడపా దడపా సెటైర్లు.. అబ్బో, నాగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఇక, హౌస్‌లోకి కూడా నాగ్ ఎంట్రీ ఇచ్చేశాడు. హౌస్ అంతా కలియతిరిగాడు. నాగ్ వెంట అందాల భామలు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. తమ డాన్సులతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా చూస్తే, గత రెండు సీజన్లను మించి ఈ సారి షో ప్రారంభోత్సవం వుందన్నది నిర్వివాదాంశం. హౌస్ డిజైన్ అదిరిపోయింది. ది బెస్ట్ హౌస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంత అందంగా తీర్చిదిద్దారు.
ఫస్ట్ సీజన్, రెండో సీజన్‌లలో ఉపయోగించిన లుక్‌తో పోల్చితే, ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనడం అతిశయోక్తి కాకపోవచ్చు. కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. టీవీ9 యాంకర్ జాఫర్ (Jaffar Babu), సినీ నటి హేమ (Actress Hema), టీవీ నటులు అలీ రెజా (Ali Reja), రవి కృష్ణ (Ravi Krishna), హిమజ (Himaja), రోహిణి (Rohini), శివజ్యోతి (సావిత్రక్క) (Siva Jyothy), శ్రీముఖి (Sree Mukhi), హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh), హీరోయిన్ వితికా షెరు (Vithika Sheru), కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ (Baba Bhaskar), సినీ కమెడియన్ మహేష్ విట్ట (Mahesh Vitta), సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj), సోషల్ మీడియా సెన్సేషన్ అశు రెడ్డి (Ashu Reddy), సినీ నటి పునర్నవి (Punarnavi Bhupalam) భూపాలం తదితరులు ఈసారి బిగ్‌హౌస్‌లోకి (Bigg Boss 3 Telugu) ఎంటర్ అయ్యారు.
గడచిన రెండు సీజన్లతో పోల్చితే, ఈసారి కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్ తప్పదేమో అన్పిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సైతం చాలా స్కోప్ వున్నట్లుగానే వుంది.. కంటెస్టెంట్స్‌ని చూస్తోంటే. కంటెస్టెంట్ల సంగతి పక్కన పెడితే, కింగ్ నాగ్ (Bigg Boss Telugu 3 Nagarjuna) మాత్రం ఫుల్ ఎనర్జీతో ఈ షోని సూపర్ హిట్ చేసేలానే వున్నాడు.