గెలవాలంటే మొండిగా ముందుకెళ్లాలి.. అని కొందరనుకుంటారు. కానీ, అన్నిచోట్లా అది వీలు కాదు. బిగ్‌బాస్‌లాంటి (Himaja Bigg Boss Mondi Ghatam) గేమ్‌లో గెలవాలంటే, హౌస్‌లో అందరితోనూ కలివిడిగా ఉండాలి. కలిసి మెలిసి ఉండాలి. కానీ, హిమజ (Himaja) రూటే సెపరేటు. ఆల్రెడీ పునర్నవి దృష్టిలో హిమజ మైనస్ మార్కులు స్కోర్ చేసింది.
సీక్రెట్ టాస్క్ కారణంగా పునర్నవి (Punarnavi Bhupalam), అలీ రెజా (Ali Reza) హౌస్‌లోనించి మాయమైతే, హమ్మయ్యా.. కాంపిటేషన్ తగ్గింది అనుకుంది హిమజ. వారిద్దరూ రాకపోవడమే మంచిదనేసింది. తాజా ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంలో రాహుల్ మీద అర్ధం పర్ధం లేని అభాండాలు మోపింది.
ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్ట్రబ్ చేస్తాడు కాబట్టి, రాహుల్‌ని నామినేట్ చేసినట్లు హిమజ చెప్పింది. అంతకు ముందు తనకు అసలు రీజనే దొరకడం లేదని చెప్పింది. గెలవాలి కాబట్టి, హౌస్‌లో ఉండాలి కాబట్టి నేనే సేఫ్ అవుతానని కొంచెం మూర్ఖంగా వాదించింది. ఈ ఒక్క డైలాగుతో హిమజకి నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.
దాదాపుగా హౌస్‌లో చాలా మందికి హిమజ ఆటిట్యూడ్ నచ్చడం లేదు. హౌస్‌లో అందరికీ వారి వారి వ్యూహాలున్నాయి. అయినా కానీ, ఎవరి గేమ్ ప్లాన్‌లో వారు వెళుతూనే, ఇతర కంటెస్టెంట్స్‌ని కలుపుకుపోతున్నారు. ఫలానా కంటెస్టెంట్‌ని ‘వద్దు’ అని చెప్పిన మొదటి కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అయితే, రెండో కంటెస్టెంట్ హిమజనే.
ఈ వారం నామినేషన్స్‌లో హిమజ (Himaja Bigg Boss Mondi Ghatam) సేఫ్ అయ్యింది. నామినేషన్‌ని తప్పించుకోవడానికి కొంచెం ఫ్రెండ్లీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హిమజతో పాటు, నామినేషన్ కోసం వెళ్లిన రాహుల్, హిమజ తీరు నచ్చక తనను తాను నామినేట్ చేసుకున్నాడు.
రాహుల్ (Rahul Sipligunj) ముక్కోపి. కానీ, హౌస్‌లో బిగ్ ఎంటర్‌టైనర్. కోపం రావడం, తర్వాత సారీ చెప్పడం, హౌస్‌లో సరదా వాతావరణం క్రియేట్ చేయడం రాహుల్‌కి అలవాటే. ఫ్రెండ్లీగా హిమజ అడిగినా రాహుల్ ఓకే చెప్పేవాడే. తన మొండి బిహేవియర్‌తో హౌస్‌లో శత్రువుల్ని హిమజ పెంచుకుంటోంది.