Bigg Boss Non Stop Bindu Madhavi.. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఐదు సీజన్లు నడిస్తే, అందులో ఒక్కో సీజన్.. ఒక్కో రకంగా నడిచింది. ప్రతి సీజన్ చుట్టూ చాలా కాంట్రవర్సీలు కనిపించాయి. కంటెస్టెంట్లు అత్యంత దారుణంగా ప్రవర్తించారు.
‘నీ అంతు తేలుస్తా..’ అంటూ కంటెస్టెంట్లు సవాల్ విసురుకున్నారు, బయటకొచ్చాక మళ్ళీ ఎవరి దారి వారిదే.
ఈ క్రమంలో తనీష్ లాంటోళ్ళ చాలా బ్యాడ్ ఇమేజ్ మూటగట్టుకున్నారు. శ్రీముఖి కూడా అంతే. అఖిల్ సార్ధక్ మీద వచ్చిన నెగెటివిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఆ అఖిల్ సార్ధక్ (Akhil Sarthak) బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop)లో కూడా వున్నాడు. అఖిల్ వర్సెస్ బిందు మాధవి.. పెద్ద రచ్చే నడిచింది. మిత్రతో తాజాగా బిందు మాధవికి గొడవ షురూ అయ్యింది.
Bigg Boss Non Stop Bindu Madhavi.. విజయం వరించేనా.?
నిజానికి, బిందు మాధవి (Bindu Madhavi) చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈ సీజన్ విజేత బిందు మాధవి.. అంటూ ఆమె మద్దతుదారులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
కౌశల్ (Kaushal Manda), అభిజీత్ (Abijeet) తర్వాత ఆ స్థాయిలో బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Non Stop) కంటెస్టెంట్‌గా పాపులారిటీ దక్కించుకున్నది బిందు మాధవి మాత్రమే.

అయితే, తాజాగా మిత్రా శర్మతో బిందు మాధవి (Bindu Madhavi Bigg Boss Telugu) వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా మారిందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
బిందు మాధవిపై ఎందుకింత నెగెటివిటీ.!
మిత్రా శర్మ ఓవరాక్షన్ చేయడంతోనే బిందు మాధవి (Bindu Madhavi) అతిగా స్పందిస్తూ, ఆమెను వెకిలిగా ఇమిటేట్ చేసిందా.? అన్నది కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయమే.
కారణం ఏదైతేనేం, అనూహ్యంగా బిందు మాధవి మీద నెగెటివిటీ ఏర్పడింది. ‘బిందు మాధవిని ఎలిమినేట్ చేసెయ్ బిగ్ బాస్..’ అంటూ బిగ్ బాస్ అభిమానులు (బహుశా బిందు మాధవి హేటర్స్) ఈ కొత్త నినాదాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేస్తున్నారు.
మొత్తం ఐదు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లు విజేతలుగా నిలిచారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయంలో అయినా, ఫిమేల్ కంటెస్టెంట్‌ని విన్నర్‌గా ప్రకటిస్తారా.?
బిందు మాధవి (Bindu Madhavi) గనుక చివరి వరకూ వుంటే మాత్రం అది సాధ్యమవ్వొచ్చు.
Also Read: సాయం చేసేవాడు దేవుడైతే.. నువ్వే ఆ దేవుడివి పవన్ కళ్యాణ్.!
ఒకవేళ విన్నర్ అఖిల్ అని ముందే నిర్వాహకులు ఫిక్సయితే, బిందు మాధవి మీద ఈ నెగెటివిటీ సరిపోతుంది.. ఆమెను వున్నపళంగా.. అదీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేయడానికి.!
బిగ్ బాస్ రియాల్టీ (Bigg Boss Telugu) షోలో ఏదైనా జరగొచ్చు.