Bigg Boss Telugu 5.. బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు వెర్షన్ ఐదో సీజన్.. అత్యంత క్రూరత్వంతో సాగుతోందా.? అంటే, ఔననే చెప్పాలేమో. ఇంతకు ముందు నాలుగు సీజన్లలోనూ కంటెస్టెంట్ల మధ్య యుద్ధ సన్నివేశాల్ని తలపించే టాస్కులు నడిచినా, మరీ ఇంత దారుణంగా, దుర్మార్గంగా నడిచిన పరిస్థితి లేదేమో.
ఈగల్, ఊల్ఫ్.. అంటూ రెండు టీమ్స్‌గా సభ్యుల్ని విభజించారు.. ఈగల్ టీమ్ సభ్యుడైన లోబో, అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో, టాస్క్ విషయంలో ఈగల్ టీమ్ స్ట్రెంగ్త్ తగ్గింది. ఆ తక్కువ బలంతోనే, పూర్తి బలం కలిగి వున్న ఊల్ఫ్ టీమ్‌తో పోటీ పడాల్సి వచ్చింది ఈగల్ టీమ్.
తక్కువ బలం వుంది గనుక, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంటుందని ఈగల్ టీమ్ కెప్టెన్ శ్రీరామచంద్ర టీమ్ మెంబర్స్‌ని ఉత్సాహపరిచాడు. మరోపక్క, ఊల్ఫ్ టీమ్ కెప్టెన్ సంగతెలా వున్నా, షాడో కెప్టెన్ రవి వ్యూహాలే కాస్తంత వైల్డ్‌గా అనిపించాయి.
కాగా, చక్రాల బల్ల మీద దేక్కుంటూ వెళ్ళాల్సిన టాస్క్‌లో ఈగల్స్ టీమ్ గెలిచింది. లోబో ఆడలేడు గనుక, విశ్వా రెండు సార్లు.. దేక్కుంటూ వెళ్ళాడు. నిజానికి, ఈ విషయంలో ఈగల్స్ టీమ్‌ని అభినందించి తీరాలి. అయినాగానీ, ఊల్ఫ్ టీమ్.. వితండవాదానికి దిగింది. ఊల్ఫ్ టీమ్ కెప్టెన్ మానస్ వాదన ఒకింత ఛండాలంగా వుంది ఈ విషయంలో.
మరోపక్క, టాస్క్ ముగిసే సమయంలో.. బేటన్స్ కౌంట్ దగ్గరకొచ్చేసరికి డ్యామేజ్ అయిన బ్యాటన్‌ని కూడా కౌంట్ చేయాలని మానస్ పట్టుబట్టాడు.. శ్రీరామచంద్రని బలవంతంగా ఒప్పించేశాడు. లేకపోతే, ఆ టాస్క్ విషయంలోనూ గందరగోళం తలెత్తేదే.. టాస్క్ రద్దయ్యేదే. అంతకు ముందు మరో టాస్క్ సందర్భంగా ఈగల్స్ టీమ్.. ఫెయిలయినా.. బుకాయించేసి, టాస్క్ రద్దవడానికి కారణమయ్యింది.
మొత్తంగా చూస్తే, మానస్ (Bigg Boss Telugu 5 Maanas Vs Sreerama Chandra) చాలా తప్పిదాలే చేసేశాడు.. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరామచంద్ర జెన్యూనిటీకి మార్కులు పడ్డాయి. అయితే, అంత పెద్ద టాస్క్ సందర్భంగా అసలేం జరిగింది.? తెరవెనుకాల అసలు తప్పెవరిది.? అన్నదానిపై పూర్తి ఫుటేజ్ చూస్తేనేగానీ అర్థం కాదు. కనిపించేదంతా నిజమనీ అనుకోవడానికి వీల్లేదు.
కొట్టుకున్నారు.. తన్నుకున్నారు.. తిట్టుకున్నారు.. నిస్సిగ్గుగా కిందా మీదా పడ్డారు.. మగతనాల గురించి ఆడ, మగ కంటెస్టెంట్లు సవాళ్ళు విసురుకున్నారు. ఇదంతా టాస్క్ వరకే పరిమితం. ఆ తర్వాత అంతా మామూలే. మధ్యలో బిగ్ బాస్ మాత్రం, సిల్లీ కామెడీ చేశాడు.. హింసకు తావు లేదని చెప్పడం ద్వారా. బిగ్ బాస్‌లో నడిచిందే జుగుప్సాకరమైన హింస. దానికి తావు లేదని బిగ్ బాస్ చెబితే ఎలా.?