Bigg Boss Telugu 5 Sarayu అంతా ఊహించినట్లుగానే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తొలి వికెట్‌గా సరయు ‘బలైపోయింది’. బిగ్ బాస్ రియాల్టీ షో లోకి అడుగు పెడుతూనే, సరయు తానేంటో చూపించేసింది. కాదు కాదు, సరయుని ఏ పని మీద లోపలకి పంపిస్తున్నారో, బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెప్పేశారు. అయితే, అందుకు తగ్గట్టుగా ఆమె లోపల ‘పెర్ఫామ్’ చేయలేకపోయింది.
కానీ, బయటకు వచ్చేటప్పుడు మాత్రం, సరయు విశ్వరూపం చూపించేసింది. స్క్రిప్ట్‌లో సూచించిన మేరకు, నటనలో ఎక్కడా తగ్గలేదు. వీజే సన్నీతో కలిసి ఓ సినిమా చేసిందట సరయు. ఆ సినిమా సమయంలో సన్నీతో చిన్నపాటి గొడవ జరిగిందట. దాన్ని మనసులో పెట్టుకుని సన్నీ, సరయుని టార్గెట్ చేశాడట. ఇదీ సరయు చెప్పిన కథ.
లహరి షరి పేరు ప్రస్తావిస్తూ, ‘నీ స్థాయికి నేను దిగజారలేను..’ అని సరయు చేసిన కామెంట్స్ ముమ్మాటికీ అబ్జెక్షనబుల్. ‘మింగడం’ అనే డబుల్ మీనింగ్ బూతు పదాన్ని సరయు ఇంట్రో సమయంలో ఆమెతో చెప్పించడం ద్వారానే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమె నుంచి హౌస్‌లో ఏం ఆశించారో అందరికీ అర్థమయిపోయింది. దానికి ఆమె బయటకు వచ్చే సమయంలో న్యాయం చేసిందని అనుకోవాలేమో.
సిరి హన్మంత్ విషయంలోనూ సరయు ‘అతి’ చేసింది. ఒక్క ఆర్జే కాజల్ విషయంలోనే కాస్త సంయమనం పాటించింది. ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్ అన్నదే నిజమైతే, సరయు తన స్థాయిని బిగ్ బాస్ వేదిక ద్వారా దిగజార్చేసుకుంది. లేదూ, అది ఆమె తనంతట తానుగా బిహేవ్ చేసిన వైనం అయితే.. ఆ దిగజారడంలో పరాకాష్ట అనుకోవాలి.
అన్నట్టు, సరయు బిగ్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోందట.. అదీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఇది నిజమేనా.? నిజమే అయితే, ఈసారి బిగ్ హౌస్‌లో సరయు (Bigg Boss Telugu 5 Sarayu ) ద్వారా బూతుల మోత మోగిపోతుందంతే.