Table of Contents
Bigg Boss Telugu 6.. బిగ్ బాస్ రియాల్టీ షో కొత్త సీజన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసిందహో.! ఔను, అతి త్వరలో కొత్త సీజన్ ప్రారంభమవబోతోంది.
మొన్నామధ్య బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీ బిగ్ బాస్ చూశాం. ఈసారి, అంతకు ముందులా టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే రెగ్యులర్ బిగ్ బాస్ రియాల్టీ షో చూడబోతున్నాం.
కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) కొత్త సీజన్‌కి (Bigg Boss Telugu) హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
మొదటి, రెండు సీజన్లను మినహాయిస్తే, బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో కలుపుకుని మిగతా అన్ని సీజన్లకూ కింగ్ నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
కొత్త సీజన్ ప్రారంభమయ్యేదెప్పుడు.?
త్వరలో, అతి త్వరలో.. అంటూ ఓ వీడియో విడుదల చేశారు బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులు. స్టార్ మా ఛానల్లోనే కొత్త సీజన్ కూడా ప్రసారం కాబోతోంది.
లోగోని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ఒకింత ఇంట్రెస్టింగ్‌గానే వుంది. అందులోని కలర్, ప్యాటర్న్ గురించి స్పెషల్‌గా చెప్పారుగానీ, జస్ట్ బాగానే వుందంతే.
ప్రోమోల జాతర షురూ అవబోతోంది..
ప్రముఖ దర్శకుడొకరు బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu) కొత్త సీజన్ కోసం ప్రోమోల్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అవెలా వుండబోతున్నాయన్నది ముందు ముందు చూడబోతున్నాం.
ఇంతకీ, కొత్త సీజన్లో కంటెస్టెంట్లు ఎవరబ్బా.? అన్న డౌట్ రావడం సహజమే. పాత మొహాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు. అయితే, పాతవారికి ఛాన్స్ వుండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.
కొద్ది రోజుల్లో సోషల్ మీడియాలో ఎటూ మేనియా షురూ అవుతుంది. ఆర్మీలు తయారైపోతాయ్. వేలు కాదు, లక్షలు వెచ్చించి, పీఆర్ టీమ్స్‌ని పెట్టుకోక తప్పదు కంటెస్టెంట్స్.
Bigg Boss Telugu 6.. వివాదాల మాటేమిటి.?
గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోని ‘బ్రోతల్ హౌస్’గా అభివర్ణించారో రాజకీయ ప్రముఖుడు. కొన్నాళ్ళ క్రితం ఓ న్యూస్ రీడర్, తనను మోసం చేశారనీ, అక్కడ కాస్టింగ్ కౌచ్ జరుగుతుంటుందని ఆరోపించింది.
Also Read: సమంత, నాగచైతన్య, శోభిత.. ‘ట్రయాంగిల్’ స్టోరీ వెనుక.!
ఈసారీ అలాంటి వివాదాలు వుంటాయా.? వుండవని అయితే చెప్పలేం. అది కూడా ఓ రకంగా పబ్లిసిటీనే.! ప్రైజ్ మనీ గతంలో కంటే ఎక్కువ వుంటుందనీ, రచ్చ అంతకు మించి వుంటుందనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.!