Bigg Boss Telugu OTT.. మొన్నీ మధ్యనే ఓటీటీ వేదికపై ప్రయోగాత్మకంగా హిందీ బిగ్‌బాస్ చూశాం. టీవీల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌తో పోల్చితే, కొంచెం భిన్నమైన ఫార్మేట్ ఇది. ఓటింగ్ సహా చాలా మార్పులున్నాయ్. సరే, అది వర్కవుటయ్యిందా.? లేదా.? అన్నది వేరే చర్చ.
ఇప్పుడంతా ఓటీటీ మేనియా నడుస్తోంది. ఎక్కడ విన్నా ఓటీటీ గురించిన చర్చే. సినిమాలూ ఓటీటీ వైపు చూస్తున్నాయ్. అందుకే బిగ్‌బాస్ కూడా ఓటీటీ వైపు చూడక తప్పడం లేదు. తెలుగు బిగ్‌బాస్ కూడా ఓటీటీ వైపు దృష్టి సారించాడు. త్వరలో అతి త్వరలో తెలుగు బిగ్‌బాస్ కొత్త సీజన్ ఓటీటీలో వస్తుందట.
Bigg Boss Telugu OTT.. ఎలా సామీ.? ఎలా.!
బిగ్‌బాస్ 3,4,5 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ ఓటీటీ గురించి ఇటీవల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ గురించి సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పాడు. అయితే, ఓటీటీ కోసం నాగార్జున కాకుండా బుల్లితెర యాంకర్, సినీ దర్శకుడు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించేలా ఓటీటీ బిగ్‌బాస్‌ని ప్లాన్ చేస్తున్నారనేది తాజా కబర్.
ఇంతకీ ఓటీటీలో బిగ్‌బాస్ సక్సెస్ అవుతుందా.? బిగ్‌బాస్ ఐదో సీజన్ బుల్లితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఓటీటీ తెరపై బిగ్‌బాస్ దండగ.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. కానీ, కంటెస్టెంట్ల ఎంపిక వంటి వ్యవహారంపై ఇప్పటికే పని మొదలైపోయిందని అంటున్నారు.
గ్లామర్ డోస్ ఎక్కువేనట.. నిజమేనా.?
ఇదిలా వుంటే, ఓటీటీ తెలుగు బిగ్‌బాస్, గ్లామర్ పరంగా అదనపు స్టఫ్‌తో కూడి వుండబోతోందని సమాచారం. ఇక బిగ్‌బాస్‌కి వెళ్లడం ద్వారా ఎన్ని వివాదాలొచ్చినా పాపులారిటీ పెరుగుతుంది కనుక కంటెస్టెంట్లు పోటెత్తడం మామూలే.
Also Read: డ్రైవరు లేని కారు.. ‘ట్రాఫిక్ చలాన్లు’ సంగతేంటి.?
ఓటీటీ బిగ్‌బాస్ కనుక స్టార్డమ్ పరంగా ‘తోపు’ అనదగ్గ వారితో పెద్దగా అవసరం వుండకపోవచ్చు. అన్నట్లు బిగ్‌బాస్ సీజన్ 5 కోసం కూడా ‘తోపు’ అన్న కేటగిరిలో కొంతమందిని మాత్రమే తీసుకున్నారులెండి.