బిగ్‌బాస్ హోస్ట్‌గా (Bigg Boss 3 Telugu ) నాగార్జున (King Akkineni Nagarjuna)ఎంత వరకూ సక్సెస్ అయ్యాడు.? అనే ప్రశ్న చుట్టూ చాలా డిబేట్ జరుగుతోంది. ఆల్రెడీ బీభత్సమైన టీఆర్‌పీ రేటింగ్స్ ఈ సీజన్‌కి వస్తుండడంతో, ఇప్పటిదాకా జరిగిన సీజన్స్ కంటే పెద్ద హిట్ అయ్యిందని అంతా తీర్మానించేస్తున్నారు.
మరో పక్క నాగార్జున హోస్ట్‌గా ఆశించిన మేర అవుట్ పుట్ ఇవ్వలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది. చాలా మంది ఎన్టీఆర్ ది బెస్ట్ అంటున్నారు. ప్రయత్న లోపం లేకుండా, నాని కష్టపడ్డ వైనానికి గుర్తింపు లభించిందనుకోండి. అది వేరే సంగతి.
అయితే, కంటెస్టెంట్స్‌తో, వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగ్ ఇంటరాక్ట్ అవుతున్న తీరు చాలా మందికి నచ్చడం లేదు. నాగార్జునపై సోషల్ మీడియా వేదికగా ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతోంది ఏమో కానీ, నాగార్జున మాత్రం వీకెండ్ ఎపిసోడ్స్‌కి మ్యాగ్జిమమ్ గ్లామర్ అద్దుతున్నాడు.
ఇక తాజా ఎపిసోడ్స్ విషయానికి వస్తే, అలీ రెజా (Ali Reza) విషయంలో నాగార్జున కొంత అత్యుత్సాహం ప్రదర్శించాడనీ అంటున్నారు మెజార్టీ బిగ్‌బాస్ వ్యూయర్స్. అలీ, హిమజ (Himaja) మధ్య జరిగిన గొడవలో అలీని మందలించడం వరకూ ఓకే. అదే సమయంలో హిమజనీ మందలించి ఉండాల్సింది.
మరీ ముఖ్యంగా అలీతో గుంజీలు తీయించడం నాగార్జునకు తగదు. అలీ తప్పదు కనుక కాసేపు తీవ్ర మనోవేదనకు గురైనా, తర్వాత తేరుకున్నాడు. అలీని అభిమానిస్తున్న వారు మాత్రం సోషల్ మీడియాలో నాగార్జునను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి, రాహుల్ విషయంలో నాగ్ తీరు పైనా విమర్శలు వస్తున్నాయి.
రాహుల్ ఫ్యాన్స్ నాగ్‌ని ఆడేసుకుంటున్నారు. తమన్నాని నాగార్జున మందలించడం యునానిమస్‌గా అందరికీ నచ్చింది. వరుణ్, వితికల రొమాంటిక్ ట్రాక్‌పై నాగ్ ఫోకస్ ఫన్‌ని జనరేట్ చేసింది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో శనివారం ఎపిసోడ్ డిఫరెంట్ ఫీలింగ్స్‌తో బాగానే జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే, పెద్దగా లోటు లేదు.
ఇదిలా ఉంటే, శ్రీముఖిపై (Sree Mukhi) క్రియేట్ అయిన నెగిటివిటీ ఇప్పుడు తగ్గింది. హిమజ విషయంలోనూ అదే జరిగింది. తమన్నాకి కూడా ఈ ఎపిసోడ్ ప్లస్సే. సారీ చెప్పడం ద్వారా ఆమె హుందాతనం చాటుకున్నట్లయ్యింది. ఎటొచ్చీ ఆలీ, రాహుల్ పరిస్ధితే దారుణంగా తయారైంది.
ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది సస్పెన్స్. తమన్నా వికెట్ డౌన్.. అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. పునర్నవి, వితిక, రాహుల్, బాబా భాస్కర్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటిదాకా జరిగిన ఎలిమినేషన్స్ పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో జరిగినట్లే అనిపించాయి. మరి, ఈ సారేం అవుతుందో.