శ్రీముఖి (Sree Mukhi) రియల్ లైఫ్‌లో ఎలా వుంటుంది.? అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. శ్రీముఖి అంటేనే జోష్. ‘పటాస్’ కామెడీ షో ద్వారా శ్రీముఖి (Sree Mukhi Hot and Wild) చేసిన హంగామాని మర్చిపోలేం. అయితే, శ్రీముఖి కొంచెం క్లాస్‌గా కన్పించిందా.. అంతే సంగతులు.!
క్లాస్‌గా కన్పించే పక్కా మాస్ శ్రీముఖి (Sree Mukhi Army), బిగ్ హౌస్‌లో ఎలా వ్యవహరిస్తుంది.? అన్న అనుమానాలు కొంతమందికైనా వుంటే, అవి పటాపంచలైపోవాల్సిందే. ఎందుకంటే, శ్రీముఖి ఊర మాస్. కాదు కాదు, ఊర నాటు.! ఓపెనింగ్ డే సెర్మానీ సందర్భంగా బిగ్ బాస్ వేదికపై హై ఓల్టేజ్ పెర్ఫామెన్స్ చూశాక.. అదే ఎనర్జీని హౌస్‌లో కొనసాగించడం చిన్న విషయం కాదు.
షార్ట్ నిక్కర్లో శ్రీముఖి (Sree Mukhi Hot and Wild) అదరగొట్టేసిందంతే. వల్గర్‌గా కన్పించలేదు సరికదా.. శ్రీముఖి క్యూట్ అప్పీల్ డబుల్ అయ్యింది ఆ నైట్ డ్రస్‌లో. అంతేనా, శ్రీముఖి బిగ్ హౌస్‌లో చేసిన రచ్చ కిర్రాకు పుట్టించేసిందంతే. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాత్రమే కాదు, పెర్ఫెక్ట్ మైండ్ సెట్‌తో అందరి మైండ్‌నీ బ్లాంక్ చేసేస్తోంది శ్రీముఖి. మొత్తంగా బిగ్ హౌస్‌ని (Bigg Boss 3 Telugu) తన కంట్రోల్లోకి తెచ్చేసుకునే ప్లాన్‌ని ఆల్రెడీ అమలు చేసేస్తున్నట్టుంది ఈ బుల్లితెర రాములమ్మ. కాగా, బిగ్ బాస్, ఆల్రెడీ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించేశారు.
నామినేట్ అయిన హౌస్ మేట్స్ లిస్ట్‌లో శ్రీముఖి కూడా వుంది. వరుణ్ సందేశ్ (Varun Sandesh), వితిక (Vithika Sheru), బాబా భాస్కర్, జాఫర్, రాహుల్ తదితరులు శ్రీముఖితోపాటు నామినేట్ అయ్యారు. అయితే, నామినేషన్ ఉంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్ ఓ అవకాశం కల్పించారు. హేమని మానిటర్‌గా పెట్టారు. ఆమె ఒకర్ని సేవ్ చేసేందుకు అవకాశం వుంది నామినేషన్ నుంచి. ఈ క్రమంలో గూడు పుఠానీ షురూ అయ్యింది.
తనతోపాటు నామినేట్ అయినవారందర్నీ తన చెప్పు చేతల్లో వుంచుకునేందుకు శ్రీముఖి మాస్టర్ ప్లాన్ రచించినట్లే కన్పిస్తోంది. పైగా, హేమకి చాలా క్లోజ్ అయ్యేందుకు శ్రీముఖి తనదైన వ్యూహం ఖరారు చేసుకుంది. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్లో (Bigg Boss Telugu 3) శ్రీముఖి ఎనర్జీ టాప్ క్లాస్. బాబా భాస్కర్ – జాఫర్ మధ్య కామెడీ భలేగా పేలింది. వ్యాయామం పేరుతో జాఫర్‌ని ఓ రేంజ్లో ఆడుకున్నాడు బాబా భాస్కర్.
స్విమ్మింగ్ పూల్ వద్ద శ్రీముఖి (Sree Mukhi Hot and Wild) ఓవరాక్షన్ కాస్తా స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. హౌస్‌లో గ్లామర్‌కి కరువేమీ లేదు. ఎవరికి వారు తమ గ్లామర్‌తో హౌస్‌కి కళ తెచ్చేశారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం పునర్నవి ఇంతవరకు మాట్లాడినట్లు ఎక్కడా కన్పించలేదు. శ్రీముఖి కాకుండా హౌస్‌లో గూడు పుఠానీ చేస్తోన్న మరో కంటెస్టెంట్ ఎవరంటే సావిత్రి అలియాస్ శివజ్యోతి అని చెప్పక తప్పదు. ఆమె ఓ రేంజ్లో రాజకీయాలు నడిపేస్తోంది.
అన్నట్టు, వరుణ్ సందేశ్ – వితికా షెరు (Varun Sandesh Vithika Sheru) మధ్య రొమాంటిక్ ట్రాక్ నడుస్తూనే వుంది. ఇదిలా వుంటే, అలీ రెజా కండలు తెగ చూపించేస్తున్నాడు. అలీ రెజాతో శ్రీముఖి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోంది. ఆ మాటకొస్తే, అందరితోనూ శ్రీముఖి కెమిస్ట్రీ బాగానే పండుతోంది. బహుశా శ్రీముఖి స్ట్రాటజీలో అదీ ఓ భాగమేనేమో. ఓవరాల్‌గా చెప్పాలంటే, శ్రీముఖి (Sree Mukhi Hot and Wild) బిగ్‌హౌస్‌లో మోస్ట్ ఎట్రాక్టివ్ కంటెస్టెంట్‌గా ఆల్రెడీ మార్కులేయించుకుందన్నది నిర్వివాదాంశం.