మొన్న బాబా భాస్కర్, ఇప్పుడు పునర్నవి.. (Punarnavi Bhupalam Bigg Boss) నామినేషన్స్ పర్వం సందర్బంగా ఒకర్ని ఒకరు డామినేట్ చేసుకున్నారు. ఒకరు మంచి మార్కులు కొట్టేయడానికి హంగామా చేస్తే, ఇంకొకరు హౌస్‌లో తన పట్ల పెరిగిపోతున్న వ్యతిరేకతను తట్టుకోలేక బరస్ట్ అయిపోయారు.
ఆ ఇద్దరూ ఎవరో కాదు బాబా భాస్కర్ (Baba Bhaskar), పునర్నవి (Punarnavi Bhupalam). ఈ ఇద్దరూ ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయ్యారు. అంతకు ముందు హౌస్‌లో నాటకీయ పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. అవన్నీ ఓ ఎత్తు, నామినేషన్ పర్వం మొదలయ్యాక గొడవలు ఇంకో ఎత్తు.
నామినేషన్ పర్వానికి కొద్ది సమయం ముందు వితిక (Vithika Sheru), రవికృష్ణలకు (Ravi Krishna) యాక్టివిటీ రూమ్‌లో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అక్కడ రెడ్ మరియు గ్రీన్ బటన్‌ని చెరొరు ప్రెస్ చేయడంతో, బిగ్‌బాస్ ఆదేశం మేరకు మగవాళ్ళంతా ఈ వారం రోజులపాటు బెడ్‌రూమ్‌లో పడుకునేందుకు అవకాశం కోల్పోయారు. వారు లివింగ్ ఏరియాలో పడుకోవాల్సి వుంటుంది.
ఇక, నామినేషన్ల పర్వం విషయానికొస్తే.. మొదటి నుంచీ సిల్లీ రీజన్స్‌తోనే నామినేషన్స్ మొదలయ్యాయి. సరదాగా, సిల్లీగా ప్రారంభమైన నామినేషన్స్ ఎపిసోడ్ ఒక్కసారిగా హార్డ్ టర్న్ తీసుకుంది. తమన్నా ఓవరాక్షన్ చేసింది. రవికృష్ణపై తిట్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో హౌస్ సభ్యులు (Punarnavi Bhupalam Bigg Boss Telugu 3) ఆమెను ఎంతలా వారించినా తగ్గలేదు. రవికృష్ణ మాత్రం మౌనంగా వుండిపోయాడు.
పునర్నవి అసహనం.. ఆవేదన.. Punarnavi Bhupalam Bigg Boss
చిట్టచివరగా నామినేట్ చేయడానికి వచ్చిన పునర్నవి, తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. తాను హౌస్‌లో ఎంతగా మారదామని అనుకున్నా, తనను మారనివ్వడంలేదనీ, హౌస్‌లో అందరూ తనను టార్గెట్ చేస్తుండడంతో హౌస్‌లో వుండాలన్న కోరిక చచ్చిపోయిందంటూ సెల్ఫ్ నామినేషన్ చేసకుంది పునర్నవి.
అయితే సెల్ఫ్ నామినేషన్ అనేది బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్ధమని బిగ్‌బాస్ హెచ్చరించారు. మొత్తం అందర్నీ నామినేట్ చేయడంతోపాటు, పునర్నవిని సీజన్ ముగిసేవరకూ నామినేట్ చేస్తానని హెచ్చరించేసరికి, కెప్టెన్ వరుణ్.. పునర్నవిని (Punarnavi Bhupalam Bigg Boss) బుజ్జగించేందుకు లివింగ్ ఏరియా నుంచి పక్కకు తీసుకెళ్ళాడు. ఆమెని ఒప్పించాడు.
దాంతో నామినేట్ చేయడానికి ఒప్పుకున్న పునర్నవి శివజ్యోతి (Siva Jyothi), బాబా భాస్కర్‌లను నామినేట్ చేసింది. అలా ఈవారం నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ రేసులో తమన్నా (Tamanna Simhadri), పునర్నవి, వితిక, రాహుల్, బాబా భాస్కర్ నిలిచారు.
తమన్నా.. జుగుప్సాకరం..
కాగా, తాను అస్సలేమాత్రం హౌస్‌లో వుండబోనంటూ తమన్నా నానా యాగీ చేయడం గమనార్హం. ‘పప్పు’ అంటూ రవికృష్ణని వేధించడమే కాదు, ‘అక్కడ’ కూడా గొరిగేసుకోమంటూ రాయడానికి వీల్లేని భాషని వినియోగించింది. అయినా, రవికృష్ణ సంయమనం పాటించాడు.
ఇదిలా వుంటే, నామినేషన్స్ సందర్భంగా పునర్నవి మీద మేగ్జిమమ్ నెగిటివిటీ క్రియేట్ అయ్యింది. అయితే, నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వరుణ్, పునర్నవితో మాట్లాడుతున్న సమయంలో.. ఆమె ఆవేదన బయటపడింది.
హౌస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయనీ, ఆ కారణంగా వరుణ్, వితిక, రాహుల్‌తోపాటు తనను పదే పదే పనిగట్టుకుని నామినేట్ చేస్తున్నారనే విషయాన్ని పునర్నవి ప్రస్తావించింది. అది నిజం కూడా. పునర్నవిని (Punarnavi Bhupalam Bigg Boss) నామినేట్ చేసే విషయంలో మహేష్, బాబా భాస్కర్‌ల గూడుపుఠానీ బయటపడింది. దాంతో, ఇప్పటిదాకా బాబా భాస్కర్ మీద వున్న ఇమేజ్ నాశనమయిపోయింది.
హౌస్‌లో ఎవరి ప్రవర్తన ఎలా వుంది.? అన్నదానికంటే, బిగ్‌బాస్ ఎవర్ని ఎలా చూపిస్తున్నాడు.? అన్నదానిబట్టే జనంలో ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం గురించి ఓ ఐడియా ఏర్పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బిగ్‌బాస్ రియాల్టీ షో. లేనిది వున్నట్లు.. వున్నది లేనట్లు భ్రమింపజేసే ఓ ‘కమర్షియల్ షో’ మాత్రమే.