టాస్క్ వచ్చినప్పుడు ధైర్యం చేసి, ఇమ్యూనిటీ పొందలేకపోవడం ఘోర తప్పిదమే కాబోతోందా పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam To Be Eliminated) విషయంలో.? హిమజ, మహేష్ విట్టాలతోపాటు ఈ వీక్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన పునర్నవి గట్టెక్కడం అంత సులభం కాదా.?
హిమజ (Himaja) వికెట్ డౌన్.. అంటూ ఓ పక్క ప్రచారం జరుగుతోంటే, మరోపక్క మహేష్ విట్టా ఎలిమినేట్ అవుతాడేమోననే స్పెక్యులేషన్స్ పెరుగుతోంటే, పునర్నవికి బిగ్ షాక్ తప్పదంటూ పుట్టుకొస్తున్న గాసిప్స్‌లో ఎంత నిజం వుంది.?
Click Here: పునర్నవి బిగ్ అండ్ పెర్ఫెక్ట్ ప్లానింగ్.!
పునర్నవి అభిమానులైతే, ఆమె బిగ్ హౌస్ (Bigg Boss 3 Telugu)నుంచి ఇప్పట్లో ఎలిమినేట్ అవడం అసాధ్యమనీ, ఆమె చివరి ఎపిసోడ్ వరకూ వుంటుందనీ, టైటిల్ సొంతం చేసుకుంటుందనీ చెబుతున్నారు. పునర్నవి ఎలిమినేట్ అవడమంటే హౌస్‌లో గ్లామర్ పూర్తిగా అటకెక్కించేయడమేననేది చాలామంది అభిప్రాయం.
శ్రీముఖి, హిమజ బిగ్‌హౌస్‌లో గ్లామర్ పరంగా బ్యాలెన్స్ చేస్తున్నా, ఎందుకో ఆ ఇద్దరితో పోల్చితే, పునర్నవికి గ్లామర్ విభాగంలో ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అందుకేనేమో, బిగ్‌బాస్ తాజా టాస్క్‌లో పునర్నవికి సూపర్బ్ క్యారెక్టర్ ఇచ్చాడు.
రవి కృష్ణతో కలిసి పునర్నవి (Punarnavi Bhupalam To Be Eliminated) హనీమూన్‌కి వెళుతున్నట్లుగా యాక్ట్ చేయాలని బిగ్‌బాస్ తన టాస్క్‌లో పేర్కొనడం, బిగ్‌హౌస్‌లో పునర్నవికి గ్లామర్ పరంగా వున్న ఇంపార్టెన్స్ ఏంటో చెప్పకనే చెప్పింది. బిగ్‌హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్కీ (Rahul Sipligunj), పునర్నవికీ కెమిస్ట్రీ నడుస్తోంటే, రాహుల్‌ని కాదని, రవికృష్ణని పునర్నవి భర్తగా యాక్ట్ చేయడమేంటో.!
Click Here: బిగ్ వికెట్ నెం.6: హిమజ వర్సెస్ పునర్నవి
సరే, ఆ సంగతి పక్కన పెడితే ఈ టాస్క్‌లో వరుణ్ సందేశ్ ఇంకోసారి ఫ్రూట్ అయిపోయాడు. వితిక తేలిపోయింది. శ్రీముఖి (Sree Mukhi) వెర్రి కేకలతో చిరాకు పుట్టించేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదో ఫ్లాప్ టాస్క్ అనడం అతిశయోక్తి కాదు. బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్ తెలుగులో టాస్క్‌లు చాలావరకు ఫెయిల్ అవుతున్నాయి.
ఒకదాన్ని మించి ఇంకోటి బోరింగ్‌గా వుంటుండడం గమనార్హం. అన్నట్టు, ప్రోమోల్లో కన్పిస్తున్నంత గ్రిప్పింగ్‌గా హౌస్‌లో కంటెంట్ కనిపించడంలేదు. రెగ్యులర్ ఎపిసోడ్‌తో పోల్చితే, కాస్తో కూస్తో స్టఫ్ ‘బిగ్ బాస్ బజ్’లోనే కన్పిస్తోందనేవారూ లేకపోలేదు.
ఏదిఏమైనా, బిగ్‌బాస్ రియాల్టీ షో రోజు రోజుకీ చప్పబడిపోతోంది. కొత్తగా ఇద్దరు అందాల భామలు హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం నిజమైతే, అప్పుడన్నా కాస్తంత ఊపు వస్తుందేమో వేచి చూడాలి.