BiggBossTelugu9 Disastrous Beginning.. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్ ప్రారంభమైంది.
‘ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశా..’ అని ఓ ప్రోమోలో అక్కినేని నాగార్జున, వెన్నెల కిషోర్‌తో అంటాడు. కానీ, ప్చ్.. బిగ్ బాస్ మారలేదు, బిగ్ బాస్ తీరు కూడా మారలేదు.
మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకటి కాదు, మొత్తం రెండు ఇళ్ళున్నాయి.. సో, బిగ్ హౌస్‌లు.. అనొచ్చేమో.
సామాన్యులు ఆరుగురు..
మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు వున్నారు. అగ్ని పరీక్ష ద్వారా సామాన్యుల్ని ఎంపిక చేశారన్నమాట.
అందుకని, సామాన్యుల్ని నేరుగా ‘ఓనర్లను’ చేసేశాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. సెలబ్రిటీలనేమో, టెనెంట్స్‌గా పెద్దగా సౌకర్యాల్లేని సాధారణ ఇంటిలోకి పంపించాడు.
‘బుజ్జిగాడు’ ఫేం సంజన అర్చన గల్రానీ, ‘లక్స్ పాప’ ఆశా షైనీ, బుల్లితెర బ్యాచ్ తనూజ పుట్టస్వామి, భరణి.. ఇలా పలువురు కంటెస్టెంట్లు బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కామెడీ కోసం అనూ ఇమ్మాన్యుయేల్, గ్లామర్ కోసం రీతూ చౌదరి.. డాన్సుల కోసం కొరియోగ్రాఫర్ స్రష్టి శర్మ, రాము రాథోడ్.. ఇలా కంటెస్టెంట్ల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది.
BiggBossTelugu9 Disastrous Beginning.. డ్రామా.. అట్టర్ ఫ్లాప్..
నటుడు భరణి, ఓ ‘బాక్స్’ తీసుకుని వేదికపైకొచ్చాడు. దాంతోనే, హౌస్‌లోకి వెళ్తానన్నాడు. నాగార్జున ఒప్పుకోలేదు. ‘షో’ అయినా వదులుకుంటానుగానీ.. అని భరణి తేల్చేశాడు.
దాంతో, వేదిక నుంచే బయటకు పంపేశాడు నాగార్జున. కానీ, కాస్సేపటి తర్వాత మనసు మార్చుకుని, భరణిని హౌస్‌లోకి పంపించాడు హోస్ట్ నాగార్జున.
ఇంతకంటే చెత్త డ్రామా, బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇంకేమన్నా వుంటుందా.? అంటే, గతంలోనూ ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని చూసేశాం.. అనుకోవాలేమో.
చివర్లో, సామాన్యుల నుంచి కంటెస్టెంట్లను పంపడం అయిపోయాక, వేదిక మీదకు వచ్చింది యాంకర్ శ్రీముఖి. నాగార్జునని రిక్వెస్ట్ చేసి, ఓ కంటెస్టెంట్‌ని లోపలకి పంపింది.
ఈ డ్రామా కూడా వర్కవుట్ అవలేదాయో. సిల్లీగా మారిపోయింది. బిగినింగ్ షో.. ఇలా తగలడితే, ఇక రానున్న రోజుల్లో బిగ్ బాస్ నుంచి ఇంకెన్ని చెత్త టాస్కులు చూడబోతున్నామో ఏమో.
అగ్ని పరీక్ష జడ్జిల్లో బిందు మాధవి వేదిక మీదకు వచ్చింది. నవదీప్ కూడా వచ్చాడు. అభి ఎందుకు రాలేదన్నది ఓ క్వశ్చన్. రానన్నాడా.? అన్న టాక్ నడుస్తోంది.
ఓవరాల్‌గా కంటెస్టెంట్ల విషయంలోనూ ‘థంబ్స్ డౌన్’ అనే అభిప్రాయం బిగ్ బాస్ వ్యూయర్స్ నుంచి వినిపిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఏమైనా, బిగ్ హౌస్‌కి కళ వస్తుందా.? అన్నది వేచి చూడాలి.