Table of Contents
BiggBossTelugu9 Fight For Food.. వాళ్ళంతా సెలబ్రిటీలే.! సామాన్యులూ వున్నాగానీ.. ఎవరూ తిండికి గతి లేక, ‘బిగ్ బాస్ రియాల్టీ షో’కి వెళ్ళరు కదా.?
‘వంట దగ్గరే అసలు సిసలు మజా’ అని చెబుతుంటాడు హోస్ట్ అక్కినేని నాగార్జున పదే పదే.! వంట వచ్చినవాళ్ళు, రానివాళ్ళు.. అందరూ వుంటారు బిగ్ బాస్ రియాల్టీ షోలో.
నిజానికి, ఎంతో కొంత వంట వచ్చి వుండాలన్నది బిగ్ బాస్ రియాల్టీ షోకి సంబంధించి ఓ రూల్. టీ, కాఫీ.. లాంటివి అయినా పెట్టడం వచ్చి తీరాలి.
BiggBossTelugu9 Fight For Food.. తగినంత ‘ఫుడ్డు’ దొరకదా.?
గతంలో, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో, కొందరు కంటెస్టెంట్లు కసరత్తులు చేసేవాళ్ళు. ఉదయాన్నే డాన్స్ మామూలే. కానీ, గత కొన్ని సీజన్లుగా ఈ వర్కౌట్ల వ్యవహారం కనిపించడంలేదు.
తిండి విషయంలో మాత్రం, రచ్చ వేరే లెవల్‌కి వెళ్ళిపోతోంది. కేవలం, తిండి కోసమే బిగ్ బాస్ రియాల్టీ షోకి వెళుతున్నారా.? అనేంతలా, ఈ తిండి యుద్ధాలు జరుగుతున్నాయి.
చపాతీ, ఆరెంజ్, పెరుగు, బిర్యానీ.. కాదేదీ ‘యుద్ధానికి’ అనర్హం. పప్పు గురించీ కొట్లాటలు జరిగిన సందర్భాలున్నాయి. ‘ఎగ్’ విషయంలో అయితే, ఈ యుద్ధాలు వేరే లెవల్ అంతే.
గుడ్డు పోయింది..
తాజాగా సీజన్లో మొత్తం ఆట అంతా, సినీ నటి సంజన కొట్టేసిన గుడ్డు గురించే.. అన్నట్లు తయారైంది. ఓ రోజు, ఆకలేసి గుడ్డు తినేసింది సంజన.
అంతే, దాని చుట్టూ రోజుల తరబడి రచ్చ జరుగుతూనే వుంది. గతంలో కూడా, ఈ ‘గుడ్డు’ చుట్టూ రచ్చ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది.
అంటే, ‘గుడ్డుతో గొడవ’ అనేది రెగ్యులర్ ఫార్మాట్ అన్నమాట బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో. వారానికి సరిపడా రేషన్ ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ, అది సరిపోవట్లేదు.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు..
రేషన్ మేనేజర్.. అని గతంలో ఓ పోస్ట్ వుండేది. కెప్టెన్, ఆ పోస్టులో తనకు నచ్చినవాళ్ళని నియమించడం చూశాం. ఈ మధ్య అలాంటి ప్రస్తావన కనిపించడంలేదు.
వంట సందర్భంగా తంటా.. ఎంత ఎక్కువగా పెట్టగలిగితే, తిండి విషయంలో ఎంత ఎక్కువగా గొడవ చేయగలిగితే.. అన్న కోణంలోనే, కంటెస్టెంట్లు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు.
Also Read: వైసీపీ ‘విగ్రహ’ వివాదం.! ఏదీ, రాజకీయ నిగ్రహం.?
వెరసి, ఆ తిండి చుట్టూ కొట్లాటలు.. యుద్ధాలు.! నలుగురూ నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, ఒక కంటెస్టెంట్ ‘తిండి’ మీద అలుగుతాడు.. అంతలోనే, తూచ్ అనేసి.. కడుపు నిండా మెక్కేస్తాడు.
