Bimbisara Preview. నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన సినిమా ‘బింబిసార’.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) సినిమాల్లోనే ఇది అత్యంత భారీతనంతో కూడుకున్న సినిమాగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ బింబిసారుడెవరు.? అతని క్రూరత్వమెలాంటిది.? పూర్తిగా నెగెటివ్ షేడ్స్‌లోనే కళ్యాణ్ రామ్ కనిపిస్తే ఎలా.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు.!
Bimbisara Preview.. తెలుగు తెరపై సరికొత్త అనుభూతి.!
తెలుగు ప్రేక్షకులకు తమ సినిమా సరికొత్త అనుభూతినిస్తుందనీ, ఓ ‘మగధీర’, ఓ ‘బాహుబలి’.. ఆ కోవలో ‘బింబిసార’ కూడా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను సంతరించుకుంటుందని అంటున్నాడు కళ్యాణ్ రామ్.
అసలే తెలుగు సినిమా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందిప్పుడు. సినిమా హిట్టయినా, లాభాలు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు.

అసలంటూ థియేటర్లకు జనాన్ని రప్పించడమే కష్టంగా మారిపోయింది. అడ్వాన్స్ బుకింగులు అనే విషయాన్నే మర్చిపోవాల్సిన పరిస్థితి.
అయితే, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Jr NTR) అభిమానులు ‘బింబిసార’ సినిమాని ఓన్ చేసుకున్నారు. ఆ కారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఫర్వాలేదన్పిస్తున్నాయి.
ఎన్టీయార్ అభిమానులు ఆ భారం మోయగలరా.?
ఏ సినిమా అయినాగానీ, తొలి రోజు తొలి అట పడక ముందే నెగెటివిటీని ఎదుర్కొంటోంది. ఈ మధ్య ఏ సినిమాకీ ఈ తలనొప్పి తప్పడంలేదు. మరి, కళ్యాణ్ రామ్ పరిస్థితేంటి.?
Also Read: పావురం చేసిన హత్య.! మీనా భర్తకి అసలేం జరిగింది.?
నిజానికి, ఆ బాధ్యత కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) అభిమానులదే. ‘బింబిసార’పై నెగెటివిటీ ఆల్రెడీ షురూ అయిపోయింది. దాన్ని తట్టుకుని నిలబడాల్సింది ఎన్టీయార్ అభిమానులే మరి.!
కథ, కమామిషు, నటీనటులు, సాంతకేతిక నిపుణులు.. ఇలా సినిమా ఎలా వుంది.? అందులో ఎవరెలా చేశారు.? అన్నవాటి కంటే, ముందు ఈ నెగెటివిటీని ‘బింబిసార’ జయించగలగాలి.