Bold and Beautiful Candy.. ఫొటోలో వున్నదెవరో తెలుసా.? చెప్పుకోండి చూద్దాం.? జస్ట్ ఓ చిన్న పజిల్.! కనిపెట్టగలరేమో ట్రై చేసి చూడండి.!
క్యాండీని మొహానికి అడ్డంగా పెట్టుకుని, విచ్చలవిడిగా అందాల ఆరబోతతో సందడి చేస్తోన్న ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమతో బాగానే సంబంధాలున్నాయ్.
తెలుగులో రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. మరో సినిమాలో తాజాగా నటిస్తోంది. మొత్తంగా ఆ మూడు సినిమాల్లో రెండు సినిమాలు ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములతో చేసింది.
ఇంకాస్త ముందుకెళితే, ఎక్కడో విదేశాల్లో చూపించాల్సిందంతా చూపించేసి, బాలీవుడ్ తెరపైకొచ్చి.. చాలామంది బాలీవుడ్ నటీనటుల కాపురాల్లో చిచ్చుపెట్టేసిందనే ఆరోపణల్నీ ఎదుర్కొంది ఈ అందాల భామ.
హిందీతోపాటు తెలుగులోనే కాదు, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ముగ్గురు పిల్లల తల్లి కూడా.
అందులోనూ ఒకమ్మాయ్‌ని దత్తత తీసుకుంది. ఇద్దరు కవలలేమో సరోగసీ విధానంలో.!
Bold and Beautiful Candy.. ఇంతకీ ఎవరబ్బా.?
ఇ:త హింట్ ఇచ్చినా ఆమె ఎవరో తెలుసుకోలేకపోయారా.? ఆన్సర్ ఇదిగో.!

ఆమె ఎవరో కాదు, సన్నీలియోన్.! క్యాండీ తీసేసి చూస్తే అసలు విషయం అర్థమయ్యిందిగా.! తెలుగులో మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా నటించిన ‘కరంట్ తీగ’ సినిమాలో నటించింది సన్నీలియోన్ (Sunny Leone).
Also Read: ప్రాంక్ స్టార్స్.. బూతులేనా వీళ్ళకి భవిష్యత్తు.!
రాజశేఖర్ (Tollywood Hero Rajasekhar) హీరోగా నటించిన ‘గరుడ వేగ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తోన్న సినిమాలో సన్నీలియోన్ నటిస్తోంది.