ఎన్నికలంటేనే ఒకింత సందడి వుండాలె. ఆ సందడి తిట్ల పురాణంలా వుండొచ్చు, ఇంకోలా కూడా మారొచ్చు. ఆ సందడే లేకపోతే, ఎన్నికల మజా ఎట్లొస్తది.? అందుకే, వివిధ రాజకీయ పార్టీలు (Brand Hyderabad Hitech City) ఏవేవో మాట్లాడేస్తున్నాయి.
అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీతోపాటు, అన్ని రాజకీయ పార్టీలూ.. ‘ఎవరూ తక్కువ కాదు’ అనే స్థాయిలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్న వైనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న విషయం పక్కన పెడితే, హైదరాబాద్‌ని అందరూ కలిసి ఓడించేస్తున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీల మధ్య వివాదాలుండొచ్చు.. ఆ పేరుతో.. హద్దులు దాటే తిట్ల రాజకీయం మొదలు పెడితే, ముమ్మాటికీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.
‘ఫలానా పార్టీ మత విద్వేషాల్ని రెచ్చగొడుతోంది.. పలానా పార్టీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తోంది..’ అంటూ ఆరోపిస్తోన్న పార్టీలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నాయి.. రాజకీయ విమర్శల్లో భాగంగా. ఎన్నికలు జరిగినన్ని రోజులే ఈ గోల.. ఆ తర్వాత ఎవరి దారి వారిదే.
ప్రధానంగా ఈ రాజకీయ విమర్శల్లో హైలైట్ అవుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi), మజ్లిస్ (ఎంఐఎం), భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత స్థాయిలో విమర్శల సర్వం వినిపిస్తున్నా, టీఆర్ఎస్ (TRS)- మజ్లిస్ – బీజేపీ (Bharatiya Janata Party) గోల నడుమ, హస్తం పార్టీ సౌండ్ ఎవరికీ వినిపించడంలేదు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పరిస్థితి ‘ఆటలో అరటి పండు’ వ్యవహారంలానే వుంది. డిసెంబర్ 1వ తేదీ వరకూ అరుపులూ కేకలూ వుంటాయ్. నాలుగో తేదీన సంబరాలు, నీరసాలూ కనిపిస్తాయి. ఆ తర్వాత అంతా మామూలే. ఎవరైనా, హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిందే. అంతకు మించి ఇంకో ఆప్షన్ ఎవరికీ వుండదు.
హైదరాబాద్ (Brand Hyderabad) మీద బురదజల్లేందుకు ఎవరూ సాహసించరు ఆ తర్వాత. మరి, ఇప్పుడే ఈ గోల ఎందుకు? అంటే, ఎవరి రాజకీయం వారికి అవసరం. మజ్లిస్ – టీఆర్ఎస్ మధ్య వున్న స్నేహం కూడా, ఈ ఎన్నికల పుణ్యమా అని చెడిపోయినట్లే కనిపిస్తోంది.
అయితే, ఇదొక కన్నింగ్ స్ట్రాటజీ అన్న విమర్శా లేకపోలేదు. ఏదిఏమైనా, గ్రేటర్ ఓటరు తెలివిగా ఆలోచించి ఓటెయ్యాలి.. ‘నాకేం సంబంధం.?’ అని ఎవరూ అనుకోకూడదు.. హైదరాబాద్ విశ్వనగరం (Brand Hyderabad Hitech City) అవ్వాలంటే.. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాల్సిందే. వేస్తారనే ఆశిద్దాం.