BRO The Avatar Teaser.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.! సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’లో సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
సాంకేతిక సమస్యల కారణంగా, అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ‘బ్రో’ టీజర్ (BRO The Avatar Teaser) విడుదలైంది.!
లేట్ అయితేనేం.. లేటెస్ట్‌గా వచ్చేసింది ‘బ్రో’.! వస్తూనే.. అభిమానులకి బోల్డంత పవర్ సందడి తీసుకొచ్చింది.!
BRO The Avatar Teaser.. దేవుడొచ్చేశాడు..
చీకట్లో ఓ వాయిస్.. ఏంటిది.? ఇంత చీకటిగా వుంది.? పవర్ లేదా.? అనే ప్రశ్న. అంతలోనే, పవర్ స్పార్క్ వస్తుంది.!
ఏవండీ.. ఎవరూ లేరా.? హలో మాస్టారూ.. గురువుగారూ.. హలో తమ్ముడూ.. బ్రో.. ఇలా పిలవడం..
పవన్ కళ్యాణ్ మీద ఫ్లాష్ కట్స్.. అదీ ‘తమ్ముడు’ సినిమాలోని పవన్ కళ్యాణ్ మాస్ గెటప్.! ఇలా మొదలైంది టీజర్.!
సాయి ధరమ్ తేజ్‌కి పవన్ కళ్యాణ్ వెల్‌కమ్ చెప్పడం.. పవన్ కళ్యాణ్ స్మైల్ అవతార్.. టీజర్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయ్.
ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.! టీజర్ చూడటం పూర్తయ్యాక కూడా ఆ మ్యూజిక్ మనల్ని వెంటాడుతుంటుంది.
తెరపై మేమమామ.. మేనల్లుడు.. చేసే హంగామా.. ఏ రేంజ్‌లో వుంటుందో ఈ టీజర్‌ని చూస్తే అర్థమయిపోతుంది. కావాల్సినన్ని ఎమోషన్స్ కూడా వుంటాయ్ సినిమాలో.
కాలం.. గడియారం.!
కాలం.. మీ గడియారానికి అందని ఇంద్రజాలం.. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్.. ఆ వాయిస్.. వారెవ్వా.!
చిన్న పిల్లాడ్ని బ్రో.. అని సాయిధరమ్ తేజ్ బుద్ధిమంతుడిలా చెబితే.. అబ్బా.. ఆహా.. అని పవన్ కళ్యాణ్ చెప్పడం.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్స్‌ప్రెషన్స్.. ఆ టీజింగ్.. సూపరంతే.!
సినిమాలెక్కువ సూత్తావేంట్రా నువ్వు.. అంటూ టీజర్ చివర్లో వచ్చే డైలాగ్‌కి విజిల్స్ పడకుండా వుండవ్.!
తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదియ సితం’ సినిమాకి ఇది తెలుగు రీమేక్. జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘బ్రో’.!