Cancer Vaccine Russia.. ఒకట్రెండు రకాల క్యాన్సర్లకు వ్యాక్సిన్ వుంది. అంటే, క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అన్నమాట. వచ్చాక, చెయ్యడానికేమీ లేదు.
మహిళల్లో ఎక్కువగా కన్పించే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ని నివారించేందుకోసం, వ్యాక్సిన్ అందుబాటులో వుంది. దాని వినియోగం కూడా బాగానే వుంది.
కానీ, క్యాన్సర్.. అంటే, అందులో చాలా రకాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది.
భారత దేశంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా వుంది.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది కూడా. క్యాన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Cancer Vaccine Russia.. సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ..
అదే సమయంలో, క్యాన్సర్ చికిత్సలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ముందుగానే గుర్తిస్తే, చికిత్స తాలూకు ఫలితాలు మెరుగ్గా వుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు.
ఇంతకీ, క్యాన్సర్‌కి పూర్తిస్థాయి వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.? అన్ని రకాల క్యాన్సర్లకూ వ్యాక్సిన్‌తో చెక్ పెట్టొచ్చా.?
ఈ ప్రశ్నకు సమాధానంగా, తాము క్యాన్సర్ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది. మనుషులపై ప్రయోగాలకు రష్యా సిద్ధమవుతోంది.
అయితే, ఈ ట్రయల్స్ ఎప్పుడు మొదలవుతాయి.? ఎప్పుడు పూర్తవుతాయి.? ఎప్పటికి క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.
డయాబెటిస్‌కే వ్యాక్సిన్ లేదాయె..
డయాబెటిస్, హైపర్‌టెన్షన్.. వీటికే సరైన మందుల్ని కనుగొనలేకపోయాం. ఇప్పుడు మార్కెట్‌లో వున్న మందులన్నీ, వాటిని అదుపులో వుంచడానికి మాత్రమే.
క్యాన్సర్‌తో డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లని పోల్చలేం. కానీ, డయాబెటిస్ అలానే హైపర్‌టెన్షన్ వల్ల కలుగుతున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.
గుండె, మూత్రపిండాలు.. తదితర కీలక అవయవాలు దెబ్బ తిననడానికి ఈ రెండు అనారోగ్య సమస్యలు ప్రధాన కారణం.
ఇక, మొన్నటికి మొన్న కోవిడ్ వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తే, వ్యాక్సిన్ ఆఘమేఘాల మీద తీసుకొచ్చారు.. అది కాస్తా, ఇప్పుడు రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.
ఏదిఏమైనా.. క్యాన్సర్ మహమ్మారిని అంతమొందించడానికి వ్యాక్సిన్ వీలైనంత త్వరగా అందుబాటులోకి రావాలి.. వస్తుందనే ఆశిద్దాం.