Chinmayi Rahul Ravindran Thaali.. పెళ్ళయిన హిందూ మహిళ ఎలా వుండాలి.? అంటే, మెడలో తాళి, నుదుటున బొట్టు.. అని పెద్దలు చెప్తారు.!
అయితే, కాలగమనంలో చాలా మార్పులొచ్చాయ్.
మెడలో తాళి దండగ.. అనుకుంటున్నారు నేటితరం మహిళలు కొందరు. నల్లపూసలు చాల్లే.. అనుకుంటున్నారు. ఆ నల్లపూసలతో చేసిన ఏదో ఒక నగ, చెవికి వున్నా చాలనే స్థాయికి ట్రెండ్ మారిపోయింది.
తప్పొప్పుల పంచాయితీ అనవసరం.! ఎవరిష్టం వాళ్ళది. ఔను, ఏమన్నా అంటే.. రక్కేసే మేతావులు ఎక్కువైపోయారు మరి.!
అన్నీ తెలిసి కూడా, రాహుల్ రవీంద్రన్ తన భార్య చిన్మయి శ్రీపాద మెడలో తాళి గురించీ, నుదుటున బొట్టు గురించీ.. కెలుక్కున్నాడెందుకో.?
Chinmayi Rahul Ravindran Thaali.. కెలికితే, ట్రోలింగ్ షురూ అవ్వుద్ది కదా రాహులా.!
తన తాజా చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్లలో భాగంగా, చిన్మయి ప్రస్తావన తీసుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్.
సింగర్ అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయని చిన్మయి, రాహుల్ రవీంద్రన్.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.
చిన్మయి అంటే.. పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం కంటే.. సోషల్ మీడియాలో తనదైన వాయిస్ బలంగా వినిపించడంతో నిత్యం వార్తల్లోకెక్కుతుంటుంది.

అలా చిన్మయి తయారవడానికి కారణమే తానంటూ రాహుల్ రవీంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘నీలా నువ్వు వుండు.. నా కోసం, నువ్వు నీ మెడలో తాళిని ధరించాల్సిన అవసరం లేదు’ అని చిన్మయితో, రాహుల్ చెప్పాడట.
బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చిన్మయికి రాహుల్ రవీంద్రన్ సూచించాడట.
సినిమా ప్రమోషన్ కోసమేనా ఇదంతా.?
ఏ బర్త అయినా, తన భార్యకి ఇలా చెబుతాడా.? చెప్పడుగాక చెప్పడు.! రాహుల్ మాటలెలా వున్నా, చిన్మయి మెడలో తాళి ధరిస్తుందిట, నుదుటున బొట్టు కూడా పెట్టుకుంటుందిట.
సరే, అది చిన్మయి – రాహుల్.. వ్యక్తిగత వ్యవహారం. ఎప్పుడైతే, దీన్ని రాహుల్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టేశాడో, సహజంగానే ట్రోలింగ్ షురూ అయ్యింది.
Also Read: ఓటీటీలోనూ కాలం ఖర్సయిపోతుంది.!
అలా ట్రోల్ అయితేనే కదా, తాను వార్తల్లో వుంటాడు.! భలే ప్లాన్ చేశాడు రాహుల్ రవీంద్రన్. సరేగానీ, ఈ రచ్చ ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి ఏమన్నా ఉపయోగపడుతుందా.? నో ఛాన్స్.!
అన్నట్టు, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో రష్మిక ండన్న, దీకక్షిత్ శెట్టి జంటగా నటించిన సంగతి తెలిసిందే.
