Chiranjeevi Humanity Media Cancer చిరంజీవి ఏం చెప్పారు.? వాళ్ళకి ఏం అర్థమయ్యింది.?
చిరంజీవి చెప్పిందేంటో వాళ్ళకి బాగానే అర్థమయ్యింది.! కానీ, వారిలోని ‘క్యాన్సర్’ తత్వం, చిరంజీవి మాటల్ని వక్రీకరించింది.
ఇది భౌతిక క్యాన్సర్ కాదు.! మానసిక క్యాన్సర్.! ఔను, వాళ్ళ మనసులకి క్యాన్సర్ పట్టింది. దానికి మందు లేదు.!
సినీ పరిశ్రమలో ఎందరో కార్మికులు క్యాన్సర్ బారిన పడుతున్నారనీ, అలా జరగకూడదంటే, ముందస్తుగా క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని గుర్తించాల్సి వుందని చిరంజీవి అన్నారు.
ఈ క్రమంలో చిరంజీవి (Mega Star Chiranjeevi) తన జీవితంలో జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావించారు. అదే చిరంజీవి చేసిన నేరమైపోయింది.
చిరంజీవి చెప్పిందేంటి.?
గతంలో తాను కొలనోస్కోపీ చేయించుకున్నప్పుడు, చిన్నపాటి సమస్యను వైద్యులు గుర్తించి, సర్జరీ చేశారనీ, అయితే అది నాన్ క్యాన్సరస్ భాగమని తేలిందని చిరంజీవి వివరించారు.
ఒకవేళ అది తొలగించకుండా వుండి వుంటే, అది క్యాన్సర్‌గా మారడానికి అవకాశాలు వుండొచ్చని వైద్యులు చెప్పినట్లు చిరంజీవి పేర్కొన్నారు.

క్యాన్సర్‌గా మారుతుంది. క్యాన్సర్‌గా మారే అవకాశం వుండొచ్చు… ఈ రెండిటికీ వున్న వ్యత్యాసం ఎవరికైనా తేలిగ్గానే అర్థమవుతుంది.. సోకాల్డ్ మానసిక క్యాన్సర్ బాధితులైన కొందరు మీడియా మాఫియాగాళ్ళకి తప్ప.
Chiranjeevi Humanity Media Cancer.. ఖర్చు నేనే భరిస్తాను..
‘జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చర్యలు తీసుకోండి.. నా అభిమానులకు, పేదలకు సంబంధించి ఖర్చు నేనే భరిస్తాను..’ అని చిరంజీవి సదరు ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారంటే చిన్న విషయం కాదు.
చిరంజీవి లాంటి వ్యక్తి, పరిశ్రమ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.? అభిమానులు, పేదల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.? అన్న ఇంగితం లేకపోతే ఎలా.?
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
మళ్ళీ చిరంజీవే ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మీడియా కాదు.. ఆ ముసుగులో నడుస్తున్న మాఫియా ఇది. ఈ మీడియా మాఫియా అనేది క్యాన్సర్ కంటే ప్రమాదకరం.
చిరంజీవి క్యాన్సర్ నుంచి కోలుకున్నారని ప్రచారం చేయడమేంటి.? దీన్ని పాత్రికేయ వ్యభిచారమనాలా.? అంతకు మించిన ఘాటైన పదాలేమైనా వాడాలా.?
కడుపు అన్నం తింటే ఇలాంటి రాతలు రావు. అశుద్ధం తింటేనే వస్తాయేమో.! ఇది సరిపోదు.! అలాగని, దీనికంటే వారి అధమ స్థాయిని ప్రస్తావించడం సాధ్యం కావడంలేదు.
చివరగా..
మెగాస్టార్ చిరంజీవికి ఓ విన్నపం.! ఇకపై ఇలాంటి మాటలు ఎక్కడా మాట్లాడొద్దని చెప్పే స్థాయి ఎవరికీ లేదు.!
కానీ, కొందరు చిరంజీవి మీద అమితమైన అభిమానంతో చెప్పక తప్పడంలేదు. చిరంజీవిగారూ.. మీరు మాత్రం ఈ పంథానే కొనసాగించండి.
మీ మాటలు వేలాది, లక్షలాది మందికి కాదు.. కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి. మీ మంచి మాట కొన్ని జీవితాల్లో వెలుగులు నింపుతాయి.
మీరు ఏం మాట్లాడినా, దాన్ని వక్ర కోణంలో చూడటం సోకాల్డ్ డర్టీ మీడియాకి అలవాటే. అది వారి నైజం. సమాజాన్ని పీక్కు తినే రాబందుల కంటే హీనం కొన్ని మీడియా సంస్థలు.