CM Pawan Kalyan Politics.. ముఖ్యమంత్రి పదవిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆశ వుంది. చంద్రబాబుకి కూడా ఆశ వుంటుంది. వైఎస్ జగన్ గతంలో ఓ సారి ముఖ్యమంత్రి అయ్యారు.
చంద్రబాబు సంగతి సరే సరి.! ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండు సార్లు, విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు టీడీపీ అధినేత.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
CM Pawan Kalyan Politics.. రాజకీయమంటే.. సేవ, బాధ్యత.!
ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంగతేంటి.? ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్‌కి ఆశ లేదా.? ఔను, పవన్ కళ్యాణ్‌కి ‘ఆశ’ లేదు.! కానీ, బాధ్యత వుంది.
అధికారం అంటే, బాధ్యత.. అని పవన్ కళ్యాణ్ భావిస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యతగల నాయకుడో, ప్రజలు చూశారు.
అందుకే, 2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జనసేన పార్టీకి ‘100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో’ ఘనవిజయాన్నిచ్చారు.
కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ విజయం సాధించినా, ఆ ఘన విజయంలో కీలక పాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌దే.!
గెలిచాక, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక కూడా పవన్ కళ్యాణ్, వ్యక్తిగత సంపాదన నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం తరఫున చేయాల్సినవి కూడా, స్వార్జితాన్ని వెచ్చించి చేస్తున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రాజకీయం.. పవన్ కళ్యాణ్ లెక్కలు వేరే వున్నాయ్..
ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజలకు బాధ్యతాయుతమైన పరిపాలన అందించడం, తన శాఖల పరంగా ప్రజలకు మెరుగైన ఫలాల్ని అందించడం.. ఇవన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
అదే, ముఖ్యమంత్రి అయితే.. ఇంకెంత అద్భుతమైన పాలన అందిస్తారో.. అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిన రోజు, పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది.
ఈలోగా, ‘పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు.. పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు..’ వంటి విశ్లేషణలు, తొందరపాటు వ్యవహారాలే అవుతాయి.
Also Read: అతడు, ఆమె.. ఇంకొక ‘డ్యూడ్’.!
‘వై నాట్ 175’ అని విర్ర వీగిన వైసీపీని, రాజకీయంగా అదః పాతాళానికి తొక్కిన పవన్ కళ్యాణ్ బలమేంటో, వైసీపీ అధినాయకత్వానికే కాదు, టీడీపీ అధినాయకత్వానికి కూడా బాగా తెలుసు.
రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ ఊహించలేరు.! పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల్ని అంచనాల వేయడం ఎవరికీ అంత తేలిక కాదు.!
పదవి మీద ఆశపడ్డానికి.. పవన్ కళ్యాణ్, ఫక్తు రాజకీయ నాయకుడు కాదు.! పదవి అంటే, బాధ్యత అని గుర్తెరిగిన ప్రజా నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్.
