Cornish Red Rhododendron Fox Tree.. తుపాన్ల కారణంగా చెట్లు కూలిపోతే ఏం చేస్తాం.? రోడ్డుకి అడ్డంగా వుంటే, ఆగమేఘాల మీద తొలగించేస్తాం.
అభివృద్ధి పేరుతో భారీ వృక్షాల్ని నరికి పారెయ్యడం మామూలే.! కానీ, ఓ చెట్టు, మహా వృక్షంగా ఎదగాలంటే ఎంత కాలం పడుతుంది.?
కీలక పదవుల్లో వున్న వ్యక్తులు, తమ రాజకీయ పర్యటనల నిమిత్తం, అత్యంత బాధ్యతారాహిత్యంతో, మహా వృక్షాల్ని నరికించెయ్యడం.. అనేది చూస్తూనే వున్నాం.
మహా వృక్షాలు.. అంటే, అవి చరిత్రకు సాక్ష్యాలు.. అదే సమయంలో, మానవాళికి అదో వరం.! విపత్తుల నుంచి మనుషుల్ని ఆ మహా వృక్షాలే కాపాడతాయి.
Cornish Red Rhododendron Fox Tree.. కలప విలువైనదే.. పర్యావరణ పరిక్షణ మన బాధ్యతే.!
విలువైన కలప ఆ వృక్షాల నుంచి వస్తుందన్నది తెలిసిన విషయమే. అంతకు మించి, మేలు ఆ వృక్షాలు బతికి వుంటేనే, మానవాళికి కలుగుతుంది.
ఇక, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో మహా వృక్షాలు కూలిపోతే, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికేసి, వాడేసుకోవడం కాకుండా, దాన్నొక, కళాకృతిగా మార్చితేనో.?

యూకేలో అదే జరిగింది. ఓ వృక్ష రాజం.. నేలకొరిగింది ప్రకృతి విపత్తు కారణంగా. నేలకొరిగిన మహా వృక్షాన్ని చూసి, ప్రకృతి ప్రేమికులు ఒకింత ఆవేదనకు గురయ్యారు.
అక్కడే, ఓ మంచి ఆలోచన చిగురించింది. దాన్ని ఓ కళాకృతిగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవు, ఆ కూలిన మహా వృక్షానికి కళాకృతిని ఇచ్చేశారు.
ఆరు మీటర్ల ఎత్తయిన నక్క.!
ఆ కళాకృతినే మీరు పైన చూస్తున్నది. ఆరు మీటర్ల ఎత్తయిన ‘నక్క’ని మీరు చూస్తున్నారు. ఫొటోలో చూస్తేనే, ఇంతలా ఆశ్చర్యపోతున్నాం కదా.! ప్రత్యక్షంగా చూస్తేనో.?
దీన్ని ఇంత అద్భుతంగా మలచడానికి ఎంత సమయం పట్టి వుంటుందోగానీ.. అంత సమయం వెచ్చించినందుకేనేమో.. ఇంత అద్భుతంగా వచ్చి వుంటుంది.
Also Read: పుస్తెలమ్మినాగానీ.. ఇకపై ‘పులస’ దొరకడం కష్టమే.!
కార్నిష్ రెడ్ రోడోడెంట్రాన్.. అనే జాతి వృక్షం చాలా చాలా ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకత వల్లేనేమో.. ఈ కళాకృతి ఇంత అందంగా మారింది. ఇంత అద్భుతంగా చెక్కిన వాళ్ళకి బిగ్ సెల్యూట్.!
వృక్ష రాజాలు, వన్య మృగాలు.. ఇవీ ప్రకృతిలో భాగమే. అభివృద్ధి పేరుతో అడవుల్ని ఆక్రమించుకుంటూ పోతున్నాం.
ఈ క్రమంలో మహా వృక్షాలు నాశనమైపోతున్నాయి. వన్య మృగాలూ అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో మనిషి భవిష్యత్తూ ప్రశ్నార్థకంగా మారుతోంది.

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు గురించి ప్రపంచమంతా ఆవేదన వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించేశారు.
అదే, ఇక్కడ.. మన చుట్టూ ఏం జరుగుతోందో మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు. మనం చేస్తున్న విధ్వంసం మన కళ్ళకే కనిపించకపోవడాన్ని ఏమనాలి.?
ప్రభుత్వాలు కళ్ళు తెరిస్తే, ఈ విధ్వంసం ఆగుతుంది. అదే సమయంలో, సగటు మనిషి.. ఏ చెట్టునైనా నరకాల్సి వస్తే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది.
