ఓ నాలుగైదు రోజులు స్కూల్ లేదా కాలేజీకి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టాల్సి వస్తే అంతే సంగతులు. ఆ విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి వుంటుంది. అలాంటిది ఓ విద్యాసంవత్సరం పూర్తిగా కోల్పోవాల్సి వస్తే.? కరోనా మహమ్మారి (Covid 19 Education System In India) నేపథ్యంలో గత ఏడాది కొన్ని పరీక్షలు జరగలేదు.. పరీక్షలు జరగకపోయినా, విద్యార్థులు తదుపరి తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. అసలు ఈ ఏడాది విద్యా సంస్థలు సరిగ్గా నడిస్తేనే కదా.?
లాక్ డౌన్.. (Corona Virus Lock Down In India) చదువులకీ, పరీక్షలకి మాత్రమే, విద్యా సంస్థల యాజమాన్యాల దోపిడీకి ఏమాత్రం కాదు. ఔను, ముక్కు పిండి మరీ విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేశాయి విద్యా సంస్థల యాజమాన్యాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా అసలు పాఠాలే సరిగ్గా చెప్పలేదు కదా.? ఫీజులెందుకు.? అని తల్లిదండ్రులు నిలదీస్తే, మెడపట్టి వాళ్ళను గెంటేశాయి స్కూళ్ళ, కాలేజీల యాజమాన్యాలు.
తప్పెవరిది.? ప్రైవేటు విద్యా సంస్థలపై (Private Educational Institutions) మోజు పెంచుకుంటోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులదా.? లేదంటే, విద్యా సంస్థల ముసుగులో కార్పొరేట్ మాఫియా నడుపుతున్న యాజమాన్యాలదా.? అంటే, సమాధానం అంత తేలిగ్గా దొరకదు. ‘విత్తనం ముందా.? చెట్టు ముందా.?’ అని ప్రశ్నంచుకోవాలేమో.
అయ్యిందేదో అయిపోయింది.. విద్యార్థుల భవిష్యత్ (Students Future Post Corona Virus Pandemic) ఏమిటి.? తదుపరి క్లాసులకు ప్రమోట్ అవుతున్నారు సరే, వారి మేధో సంపత్తి సంగతేంటి.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. నిజానికి, ఇప్పుడున్న ఇంటర్నెట్ కాలంలో, కాస్త తెలివైన విద్యార్థులు ఇంటర్నెట్ ద్వారానే వీలైనంతవరకు విద్యాభ్యాసం చేసేస్తున్నారు. ఇంకొందరు, పూర్తిగా చదువుల్ని పక్కన పడేస్తున్నారు.
ఎప్పటికి కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుందో దొరకదు. అప్పటిదాకా విద్యా వ్యవస్థ పరిస్థితి అగమ్యగోచరమే. ప్రత్యామ్నాయ విధానాలపై ప్రభుత్వాలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు (Covid 19 Education System In India) ఫోకస్ పెట్టకపోతే అంతే సంగతులు.