Crime Stories Media Responsibility.. నేర వార్తలకి మార్కెట్లో వున్న గిరాకీ అంతా ఇంతా కాదు.! అందుకే, నేర వార్తల కోసం మీడియా స్పెషల్ ‘స్లాట్’ కేటాయిస్తుంటుంది.
మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ‘తీర్పు’ ఇచ్చేయలేంగానీ.. అదో పైశాచిక ఆనందం.. అని మాత్రం అనగలం.!
క్రైమ్, సెక్స్.. ఈ రెండూ బాగా సేలబుల్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు.. అది సినిమాల్లో అయినా, వెబ్ సిరీస్‌లలో అయినా.! పాత్రికేయంలో కూడానండోయ్.!
Crime Stories Media Responsibility.. దారుణం.. హేయం..
ఇక్కడో వార్త గురించి మాట్లాడుకుందాం.! ఒరిస్సాలో ఓ వ్యక్తి విద్యుత్ వినియోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వచ్చాడట.
ప్రభుత్వం తరఫున, వినియోగదారుల నుంచి వసూలు కావాల్సిన విద్యుత్ బిల్లుల విషయమై తీసే రీడింగ్ ప్రక్రియ అది.
కానీ, రీడింగ్ ఎక్కువ వస్తోందంటూ, కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాంతో, రీడింగ్ కొలవడానికి వచ్చిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇదొక్కటే కాదు, ఇలాంటి చాలానే నిత్యం పత్రికల్లోనూ, న్యూస్ ఛానళ్ళలోనూ కనిపిస్తాయ్.
యూ ట్యూబ్ ఛానళ్ళలో అయితే మరీనూ.! చిన్న చిన్న మనస్పర్ధలకే కుటుంబ సభ్యుల్ని చంపేసుకుంటున్నవారి వార్తలు బీభత్సంగా ‘సేల్’ అయిపోతున్నాయ్.!
క్షణికావేశం మాత్రమేకాదు.. పైశాచికత్వమిది.!
ప్రేమించినమ్మాయి ఎవరితోనో చనువుగా వుంటుందని.. హత్యలకు తెగబడే ప్రేమికులు.. అనుమానంతో భర్తని చంపేసిన భార్య.. అలాంటి అనుమానంతోనే భార్యని చంపేసిన భర్త.! అబ్బో.. ఇలాంటివి నిత్యకృత్యం.
తల్లిని కాటేస్తాడొకడు.? అన్నని చంపేసే చెల్లెలు ఇంకొకరు.! చెప్పుకుంటూ పోతే.. అసలు వీళ్ళు మనుషులేనా.? అన్న డౌట్ వస్తుంది కూడా.!
ఎక్కడో ఓ చోట పైశాచికత్వం అనేది మామూలే. సంచలనం కోసం క్రైమ్ వార్తల పేరుతో మీడియా చేసే అతి కూడా.. చాలా అనర్ధాలకు కారణమవుతోంది.!
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
ఇప్పుడు చెప్పండి.. మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందా.? లేదా.? ఈ పైత్యంలో మీడియా భాగస్వామ్యం ఎంత.?
ఫైనల్ టచ్.. పైశాచిక ప్రవృత్తి అనేది మీడియాలో ఇటీవల బాగా పెరిగిపోయింది.!
ఎంతలా అంటే, జరిగిన నేరాల్ని విశ్లేషించే క్రమంలో.. వాటిని తమ మీడియా సంస్థల్లో చూపించే క్రమంలో.. అంతకు మించిన జుగుప్స ప్రదర్శించేంతలా.!