Crying Against Pawan Kalyan.. అరరె.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవడం వల్లే ఆ సినిమా ఫ్లాపయ్యిందే.!
పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే మరి.! ‘అంటే సుందరానికీ’ సినిమాలో కంటెంట్ బావుంటే, అది జనానికి బాగా ఎక్కి వుంటే, అన్నిటికీ మించి ఆడియన్స్ పల్స్ ఆ సినిమా పట్టుకోగలిగితే.. ఖచ్చితంగా హిట్టవుతుంది. లేకపోతే లేదు.!
కేవలం కంటెంట్ వున్న సినిమాలే హిట్టవుతాయని అనడానికి వీల్లేదు. మంచి సినిమాలు ఫెయిలయిన సందర్భాలూ లేకపోలేదు. సో, సినిమా అంటేనే ఓ మ్యాజిక్ అన్నట్టు.
Crying Against Pawan Kalyan.. తప్పదు.! ఏడవాల్సిందే.!
ఇక, సెంటిమెంట్లు అంటారా.? సినీ పరిశ్రమకి ఆ సెంటిమెంట్లు ఎక్కువేనని చాలామంది అంటారు. అయితే, అందులో నిజమెంత.? అన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలున్నాయి.

కానీ, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ హాజరయ్యారు, ఆ సినిమా ఫ్లాపయ్యింది గనుక.. ఆ సెంటిమెంటుతో ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్‌ని పిలవడం మానెయ్యలేదు కదా.?
పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ చుట్టూ విమర్శలు, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద అనవసరపు వివాదాలు, పవన్ కళ్యాణ్ సినిమాలపై అడ్డగోలు ప్రచారాలు.. ఇప్పుడేమో కొత్తగా పవన్ కళ్యాణ్ లెగ్గు మహిమ.. అంటూ దుష్ప్రచారం.!
Also Read: యాడున్నవ్ సుశాంత్.! ఎందుకంత తొందరగా వెళ్ళిపోయినవ్.!
కేవలం ఏడవడం కోసమే.. అదీ పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం కోసమే కొంతమంది బతుకుతున్నట్టున్నారు. అద్గదీ అసలు సంగతి. కాస్సేపు ఏడవడం మానేస్తే, వాళ్ళ ప్రాణం పోతుందేమో.! బహుశా అదొక శాపం అయి వుంటుంది.!