Dasara First Report.. నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా విషయంలో చాలా చాలా అంచనాలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా మూవీ అన్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓడెలని పాన్ ఇండియా డైరెక్టర్‌గానూ చెప్పుకున్నాడు.
ప్రోమోస్‌లో కూడా ఆ స్టఫ్ కనిపించింది. అయినాగానీ, పాన్ ఇండియా సినిమాకి జరగాల్సిన స్థాయిలో పబ్లిసిటీ అయితే జరగలేదేమో అనిపించింది. అదే సమయంలో నాని ‘అతి’ చేస్తున్నాడా.? అన్న అనుమానాలూ తెరపైకొచ్చాయి.
ఎలాగైతేనేం, భారీ అంచనాల నడుమ ‘దసరా’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ముందుగా అమెరికా నుంచి అప్డేట్స్ వచ్చేశాయ్. ఫస్ట్ రిపోర్ట్ అయితే ‘రా అండ్ రస్టిక్’ అనే వినిపిస్తోంది.!
Dasara First Report.. అదరగొట్టేశారుగానీ..
తొలి సినిమానే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో అనుభవం వున్నవాడిలా ‘దసరా’ని తెరకెక్కించాడన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న అభిప్రాయం.
నాని గురించి కొత్తగా చెప్పేదేముంది.? నేచురల్ స్టార్.! ‘రా అండ్ రస్టిక్’ రోల్‌లో ఒదిగిపోయాడు. కథాంశం ఓ విలేజ్ డ్రామా.! క్లయిమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకి ప్రాణం.!
సినిమాటోగ్రపీ టాప్ క్లాస్ కాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓవరాల్‌గా బాగానే వున్నా, కొన్ని సీన్స్‌ని ఎలివేట్ చేయడంలో మాత్రం విఫలమైంది.

ఎక్కువ కంప్లయింట్స్ ‘పేస్’ విషయంలో కనిపిస్తున్నాయి. అయితే, స్క్రీన్ మీద నటీనటులు కనిపించకుండా, ఆయా పాత్రలే కనిపించడం.. ఆ ‘లో-పేస్’ సమస్యని అధిగమించేలా చేసిందని చెప్పొచ్చు.
నాని కావొచ్చు, కీర్తి సురేష్ (Keerthy Suresh) కావొచ్చు.. తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా పూర్తయ్యాకా.. వారి పాత్రలో మైండ్‌లో తిరుగుతూ వుంటాయ్.
మాట నిలబెట్టుకున్న నాని..
ఓవరాల్‌గా చూస్తే నాని మాట నిలబెట్టుకున్నట్టే.! ఈ తరహా సినిమాలకి ఇటీవలి కాలంలో అనూహ్యమైన రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది ప్రేక్షకుల నుంచి.
ఓ మంచి ప్రయత్నమైతే నాని చేశాడన్న అభినందనలు ఖచ్చితంగా వస్తాయ్. కమర్షియల్ సక్సెస్ ఎంత.? అన్నది ప్రేక్షకులు సినిమాని ఓన్ చేసుకున్నదాని బట్టి వుంటుంది.
Also Read: Ram Charan Game Changer: లెక్కలు మార్చేసిన శంకర్.!
బాంచెత్.. నాని (Natural Star Nani) ‘రా’ అండ్ ‘రస్టిక్’గా ‘దసరా’తో హిట్టు (Dasara Review) కొట్టేశాడన్న అభిప్రాయమైతే అంతటా వినిపిస్తోంది.
యూఎస్ ప్రీమియర్స్ నుంచి అందిన తొలి రిపోర్ట్ ఇది.. ఫుల్ రివ్యూ కాస్సేపట్లో.!