Dasara Trailer Nani Mass మాస్.! ఊర మాస్.! ఔను, నేచురల్ స్టార్ నాని ఇకపై ఊర మాస్ హీరో.! ఇంతకు ముందు మాస్ సినిమాలు చేయలేదని కాదు. కాకపోతే, అందులోనూ క్లాస్ టచ్ వుండేది.
కానీ, ఇప్పుడు ఇంకో లెక్క.! మాస్.. ఊర మాస్.! ఇది వేరే లెవల్.! ‘దసరా’ ట్రైలర్ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకుని తీరాల్సిందే.
ఒక పుష్ప.. ఒక రంగస్థలం.. ఒక కేజీఎఫ్.. ఇలా చాలా సినిమాల్ని గుర్తుకు తెచ్చేలా వుంది ‘దసరా’.!
Mudra369
ఇంతకు ముందెన్నడూ నాని.. ఈ స్థాయి మాస్ గెటప్‌లో కనిపించింది లేదు.!
గెటప్ అన్నట్టు కాదు.. ఆ పాత్రలో జీవించేశాడంతే.!
రక్త సిక్తం.. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్.. ఆ ఎమోషన్స్.. ఆ యాక్షన్.. ఇవన్నీ ‘దసరా’ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయ్.!
బతుకమ్మ సంబరాలతో మొదలైన ట్రైలర్, దసరా పండక్కి రావణ దహనంతో ముగిసింది.! సినిమా కథకి ‘దసరా’తో వున్న అనుబంధమేంటో ట్రైలర్‌లో స్పష్టంగా చెప్పేశారు.
బాబోయ్ నాని..
ఔను, ఇంతకు ముందెన్నడూ నాని ఇంత మాస్ గెటప్‌లో కనిపించలేదు. నరకడం.. చావ బాదడం.. ఇవన్నీ మాస్.. ఊర మాస్ అంతే.
కీర్తి సురేష్‌తో గతంలోనే కలిసి నటించిన నాని, ఈసారి తెరపై కెమిస్ట్రీ ఇంకాస్త బాగా పండించినట్లు కనిపిస్తోంది. కెమిస్ట్రీ అంటే ఇంకోటేదో అనుకునేరు.. ఇద్దరి మధ్య అనుబంధం.!
సినిమాటోగ్రఫీ చాలా చాలా బావున్నట్లే కనిపిస్తోంది. ట్రైలర్‌ని చాలా షార్ప్‌గా కట్ చేశారు. సినిమాని కూడా అలాగే ఎడిట్ చేసి వుంటారేమో.!
Dasara Trailer Nani Mass.. వసూళ్ళ జాతరే..
తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ ‘దసరా’ (Dasara) విడుదల కాబోతోంది. సినిమాపై అంచనాలు కనీ వినీ ఎరుగని స్థాయిలోనే వున్నాయ్.
Also Read: Rana Naidu: ఆ ‘ఛండాలం’పై రానా దగ్గుబాటి క్షమాపణ.!
ఏమాత్రం తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చినా, వసూళ్ళ జాతరే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మీద హీరో నాని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనట్టే వుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళినట్లే వుంది చూస్తోంటే.