Deepti Sati Tom Beauty.. ’ఓటీటీ పుణ్యమా అని కొంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులకి మంచి ప్లాట్‌ఫామ్ దక్కుతోందనే చెప్పొచ్చు.
పెద్ద తెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ, ఓటీటీలో పలు వెబ్ సిరీసులతో సినిమాలతో కొందరు ముద్దుగుమ్మలు పాపులర్ అవుతున్నారు.

అలా పాపులర్ అయిన ముద్దుగుమ్మ దీప్తి సతి. ‘SIN’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది దీప్తి సతి. అడల్ట్ టచ్ వున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది.
ఆ తర్వాత ఓ మలయాళ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
మహారాష్ట్ర బ్యూటీ అయినప్పటికీ ‘మిస్ కేరళ’ కిరీటం దక్కించుకున్న దీప్తి సతి మలయాళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.
లేడీ ‘జాగ్వార్’
అలాగే, తమిళ, కన్నడ, మరాఠీ సినిమాలతోనూ తన సత్తా చాటింది దీప్తి సతి. ‘జాగ్వార్’ అనే కన్నడ సినిమాలో నటించింది.
బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ చేశారు.

కన్నడ మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ ఈ సినిమాలో హీరోగా నటించగా దీప్తి సతి హీరోయిన్‌గా నటించింది. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ దీప్తి సతి నెట్టింటి ప్రేక్షకులకు సుపరిచితురాలే.
ఎలాంటి పాత్రల్లో నటించడం ఇష్టమని అడిగితే, తనకు టామ్ బోయ్ పాత్రల్లో నటించాలనుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది దీప్తి సతి.
ఫుడ్ అంటే చాలా ఇష్టం..
దీప్తి సతికి నార్త్ ఇండియన్ వంటకాలతో పాటూ, సౌత్ ఇండియన్ వంటకాలు కూడా చాలా ఇష్టమని చెబుతోంది.
తనకు ఫుడ్‌పై వున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌తో షేర్ చేసుకుంటూ వుంటుంది దీప్తి సతి.

దుబాయ్ టూర్‌లో ప్రస్తుతం బిజీగా వున్న దీప్తి సతి అక్కడి అందమైన లొకేషన్లను తన అందంతో మరింత ఎలివేట్ చేస్తూ చేయించుకున్న ఫోటో షూట్లు నెట్టింట షికారు చేస్తున్నాయ్.
Also Read: ‘కన్నప్ప’ సమీక్ష: ఆ కక్కుర్తే.. కొంప ముంచిందప్పా.!
అక్కడి ఆకాశ సౌధాలతో దీప్తి అంద చందాలు.. తెగ పోటీ పడుతున్నట్లున్నాయ్ ఈ ఫోటోస్‌లోని దీప్తి సతి పోజులు.
