Table of Contents
Deputy CM Pawan Kalyan Constitutional.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.!
ఔను, ‘ఉప ముఖ్యమంత్రి’ అనే పదవికి ‘గుర్తింపు’ తీసుకొచ్చిన ఘనత నిస్సందేహంగా పవన్ కళ్యాణ్‌దే.!
అసలు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది.? ఎప్పటినుంచి ఈ పదవి గురించి జనం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.?
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ – సీమాంధ్ర.. ప్రస్తావన వచ్చినప్పుడే, ముఖ్యమంత్రి సీమాంధ్ర అయితే, తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పుట్టింది.
ఇక, ఆ తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, తెలంగాణలోనూ ఉప ముఖ్యమంత్రులు వచ్చారు.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఉప ముఖ్యమంత్రులు వచ్చారు.
Deputy CM Pawan Kalyan Constitutional.. అప్పుడు రైటు.. ఇప్పుడు రాంగు.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు పని చేశారు. మామూలుగా అయితే, ఉప ముఖ్యమంత్రి కూడా ఓ మంత్రి మాత్రమే.
వైసీపీ హయాంలోనూ, అంతకు ముందు టీడీపీ హయాంలోనూ.. ఉప ముఖ్యమంత్రి.. అన్న పదవికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు.
కానీ, టీడీపీ – జనసేన – బీజేపీ హయాంలో మాత్రం, ఉప ముఖ్యమంత్రి పదవికి అదనపు అధికారాలు వచ్చాయి. నిజానికి, ఇవేమీ కొత్త అధికారాలు కావు.
మంత్రి మండలి.. అంటే, దానికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు. ఆయా శాఖల మంత్రులు, తమ శాఖలపై పూర్తి పట్టు కలిగి వుండాలి.
డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన పవన్ కళ్యాణ్..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, బాద్యతగల ప్రజా ప్రతినిథిగా తన దృష్టికి వచ్చిన, ఇతరత్రా శాఖల్లోని సమస్యలపైనా స్పందిస్తున్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా అభినందించి తీరాలి.. ఉప ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను ఇస్తున్నందుకు.
ఆ స్వేచ్ఛని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సద్వినియోగం చేసుకుంటుండడం మరింత అభినందనీయం అని చెప్పక తప్పదు.!
అంతిమంగా, ప్రజలకు మెరుగైన పాలన అందించాలి.. అదే కదా, కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇదే విషయాన్ని హోంమంత్రి అనిత వంగలపూడి, తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు.
‘ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పరంగా అఫీషియల్ కాదు కదా..’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు హోంమంత్రి ఇచ్చిన సమాధానం సూటిగా, చాలా స్పష్టంగా వుంది.
Deputy CM Pawan Kalyan Constitutional.. అఫీషియల్ కాకపోతే.?
నిజానికి, ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ పరంగా అఫీషియల్ కాకపోతే, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఎందుకు వున్నారు.?
తమిళనాడు, కర్నాటక, తెలంగాణ.. ఇలా చాలా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు తమ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం సదరు పాత్రికేయుడికి తెలియదా.?
ఓ పాత్రికేయుడు బుర్రతక్కువతనం ప్రదర్శిస్తే, దాన్ని పట్టుకుని చాలా మీడియా సంస్థలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కథనాల్ని వండి వడ్డించేస్తున్నాయి.
పాత్రికేయ వ్యభిచారమ్.. అంటే, ఇదేనేమో.! పాత్రికేయం అంటే, అది ప్రజల కోసం.!
పాత్రికేయం.. అసలెందుకోసం.?
ప్రజా శ్రేయస్సు కోసం. మెరుగైన సమాజం కోసం, ‘పాత్రికేయం’ కూడా ప్రజాస్వామ్యంలో ఓ ‘పిల్లర్’లా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
దురదృష్టవశాత్తూ పాత్రికేయం అంటే, సంచలనాల కోసం కక్కుర్తి పడటమే అయిపోయింది.! ఓ పోలీస్ అధికారి, పద్ధతి తప్పిన కారణంగా, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
ఇలాంటి ప్రత్యేక సందర్భంలో డిప్యూటీ సీఎం పదవికి వున్న రాజ్యాంగ బద్ధతను జీరో నాలెడ్జ్‌తో ప్రశ్నించడమంటే, పద్ధతి తప్పిన అధికారికి మద్దతిస్తున్నట్లే కదా.?
సభ్య సమాజానికి ఈ దిక్కుమాలిన పాత్రికేయం.. ఏం సందేశమిస్తోందో ఏమో.!
