‘ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మహిళ అవ్వాల్సిందే..’ అంటూ అరియానా గ్లోరీ, దేవి నాగవల్లితో వ్యాఖ్యానించడం చూశాం. ‘నేను గనుక వెళ్ళిపోతే, నువ్వు లీడ్ తీసుకోవాలి..’ అని అరియానా, దేవితో చెప్పింది. కానీ, అనూహ్యంగా దేవి (Devi Nagavalli Saves Ariyana Glory) ఔట్ అయిపోయింది.. అరియానా హౌస్‌లోనే వుండిపోయింది.
బయట జనాలకు తెలియడంలేదుగానీ, లోపల వున్న కంటెస్టెంట్స్‌కి ఎవరు ఏ వరసలో బయటకు వెళతారన్నదానిపై పిచ్చ క్లారిటీ వున్నట్లుంది. కానీ, అంతా హంబక్ వ్యవహారం.! మెహబూబ్ దిల్‌సే వికెట్ పడుతుందని తొలుత ప్రచారం జరగ్గా, దేవి నాగవల్లి క్లీన్ బౌల్డ్ అయిపోయింది.
అక్కడికేదో, హౌస్‌మేట్స్ అంతా షాక్ అయినట్లు భలేగా నటించేశారు. నిజానికి, చాలా ‘పోల్స్’లో అరియానా గ్లోరీ కంటే, దేవి నాగవల్లికి కాస్త ఎడ్జ్ వుంది. మెహబూబ్ దిల్‌సే మరీ స్ట్రాంగ్‌గా లేకపోయినా.. ఈ ఇద్దరి కంటే కాస్త బెటర్‌గా వున్నాడు. ఈ పోల్స్ ట్రెండ్ ఏ వారానికి ఆ వారం.. ఏ రోజుకి ఆ రోజు మారిపోతుందనుకోండి.. అది వేరే సంగతి.
ఫైనల్‌గా, శుక్రవారం రాత్రితో ఓటింగ్ ముగిసిపోతుంది గనుక.. అప్పటి ట్రెండ్ ప్రకారం చూసుకున్నా, అరియానా ఔట్ అయిపోవాలి. కానీ, మెహబూబ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. చివరి నిమిషంలో దేవి నాగవల్లి పేరు కన్‌ఫావ్‌ు అయ్యింది.. ఎవరెవరు సేవ్ అవుతారన్న లైనప్ కూడా బయటకు వచ్చేసింది.
సో, షో చూసేవారికి సస్పెన్స్ ఏమీ లేదు. ఎవరికి ఓట్లు తగ్గుతున్నాయో, వారికి.. అనవసరమైన ఎలివేషన్ ఆయా ఎపిసోడ్లలో దక్కుతోందంటేనే.. ఈ సీజన్ ఎంత గందరగోళంగా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా బయటకు వెళ్ళినవారందరి ఆర్డర్‌పైనా పలు అనుమానాలున్నాయి వ్యూయర్స్‌కి.
కోట్లాది ఓట్లు పోల్ అవుతున్నాయని హోస్ట్ నాగార్జున చెబుతున్నా, వాటిల్లో ‘విశ్వసనీయత’ ఎంతన్నది క్వశ్చన్ మార్క్‌గానే మారిపోయింది. జస్ట్ ఇదొక గేమ్ షో.. అంతకు మంచి, దీన్ని రియాల్టీ షో అనాల్సిన అవసరమే లేదన్నది చాలామంది అభిప్రాయం.
అరియానా ఈ వారం ఓటింగ్‌లో వెనకబడి వుంది గనుక.. ఆమె ఈ వారం నామినేషన్స్‌లోకి రాకుండా దేవి ద్వారా ‘వెసులుబాటు’ కల్పించారనే ప్రచారం జోరుగా సాగుతుండడం కొసమెరుపు. అన్నట్టు, దేవి నాగవల్లి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా మెండుగానే వున్నాయట.
హౌస్ మేట్స్ కూడా, ‘నువ్వేమీ ఎలిమినేట్ అవవు.. సీక్రెట్ గదిలో పెడతారు..’ అని దేవికి చెప్పి పంపడం గమనించాల్సిన మరో అంశం.