Table of Contents
కరోనా దెబ్బకి సినిమాలన్నీ ఓటీటీ వైపు చూస్తున్నాయి. నిజానికి, కరోనా పాండమిక్ వచ్చినా, రాకపోయినా.. ఓటీటీ మాత్రం తనదైన ప్రత్యేకతను చాటుకునేదే. కరోనా పాండమిక్, ఓటీటీకి కాస్త ఊతమిచ్చిందంతే. డిజిటల్ టాకీస్.. (Digital Talkies OTT ATT Pay Per View Movies Web Series And More) ఇప్పుడీ చర్చ సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది. ఓటీటీ, ఏటీటీ, పే ఫర్ వ్యూ.. ఇలా రకరకాల కొత్త పదాలు, వేదికలు పుట్టుకొస్తున్నాయి.. వీటన్నటినీ ‘డిజిటల్ టాకీస్’గా కొందరు అభివర్ణిస్తున్నారు.
హీరోయిన్ నమిత కూడా మొదలు పెట్టిందోచ్.!
వెండితెరపై తనదైన స్టయిల్లో అందాల విందు చేసేసిన బొద్దుగుమ్మ నమిత, ‘నమిత థియేటర్’ (Namita Theatre) అంటూ ఓ డిజిటల్ వేదికను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ‘నమిత థియేటర్’ ద్వారా, అత్యద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులకు చేరువవుతుందని నమిత భావిస్తోంది. నమిత ఈ కొత్త ఓటీటీ వేదికకు బ్రాండ్ పార్టనర్. నిజానికి, చాలా గొప్ప ఆలోచనే ఇది.
సినిమా తీయడం కంటే, దాన్ని విడుదల చేయడం ఈ రోజుల్లో చాలా కష్టమైన వ్యవహారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ థియేటర్లు లేదా టాకీసులు ఔత్సాహిక ఫిలిం మేకర్స్ అలాగే నటీనటులకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందన్నది నిర్వివాదాంశం.
ముందే హెచ్చరించిన ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ.. సినీ పరిశ్రమంలో పరిచయం అక్కర్లేని పేరిది. ఒకప్పుడు సంచలన దర్శకుడు.. ఇప్పుడేమో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్. ఎవరేమనుకున్న డోన్ట్ కేర్ అనేది ఆయన నైజం. వర్మ ఎప్పుడో హెచ్చరించాడు, సినీ రంగం భవిష్యత్తుపై. రాజమౌళి కూడా ఓటీటీ ఆలోచనలు తన ‘ఆర్ఆర్ఆర్’ విషయమై చేస్తే మంచిదని సలహా వర్మ ఇచ్చాడంటే, అతని ముందు చూపు ఏ స్థాయిలో వుందో (Digital Talkies OTT ATT Pay Per View Movies Web Series) అర్థం చేసుకోవచ్చు.
సినిమా థియేటర్ల పరిస్థితేంటి.?
సినిమా థియేటర్లు ముందు ముందు ఎలా మనుగడ సాధిస్తాయన్నది ఊహించడమే కష్టంగా మారింది. ఓటీటీకి అలవాటుపడ్డాక థియేటర్ అనుభవం కోసం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగవుతాయని అనలేం. కానీ, వాటి మనుగడ కష్టమే.
బుల్లితెరకు పెద్దగా సమస్య లేనట్టే..
టీవీ సీరియళ్ళు ఓటీటీ వేదికల మీద కూడా లభ్యమవుతున్నాయి. మొబైల్ ఫోన్లలో ప్రత్యేక ‘యాప్’ల సాయంతో టీవీ సీరియళ్ళను చూసే అవకాశం దొరుకుతోంది. అయినాసరే, డిజిటల్ వేదికల వల్ల బుల్లితెరకు వచ్చిన సమస్య పెద్దగా వుండకపోవచ్చు.
డిజిటల్ టాకీస్.. ఇది చాలా హాట్.!
డిజిటల్ టాకీస్ అనగానే హాట్ కంటెంట్ అనే భావన వుంది. ఓటీటీ ద్వారా అలాంటి కంటెంట్ చాలా ఎక్కువగానే వీక్షకులకు చేరవవుతోంది. అర్థనగ్న కంటెంట్, పూర్తి నగ్నమైన కంటెంట్, అంతకు మించిన జుగుప్సాకరమైన కంటెంట్ ఈ డిజిటల్ టాకీస్ ద్వారా బయటకొస్తోంది. అలాగని, అంతా అదే వుందనుకుంటే పొరపాటు.
కొత్త తరహా ఆలోచనలకు డిజిటల్ టాకీస్ మంచి వేదికగా కనిపిస్తోంది. చిన్న సినిమాలు ఓటీటీ వేదికలపై మంచి విజయాలు అందుకుంటున్నాయి. సోషల్ మెసేజ్, ఈ ఓటీటీ వేదికల ద్వారా ఎక్కువమందికి చేరువవుతోంది. సో, డిజిటల్ స్పేస్.. మంచిని వెతుక్కోవడానికీ, అసభ్యకరమైన కంటెంట్ చూసుకోవడానికీ.. (Digital Talkies OTT ATT Pay Per View Movies Web Series And More) రెండిటికీ ఆస్కారమిస్తోందన్నమాట.