సంక్రాంతి మన తెలుగువారికి పెద్ద పండగ.. అలాంటప్పుడు, డబ్బింగ్ సినిమాలకు ఇక్కడెలా థియేటర్లు ఇస్తాం.? అని కొన్నాళ్ళ క్రితం దిల్ రాజు (Dil Raju) సెలవిచ్చాడు.
అప్పట్లో తన స్ట్రెయిట్ సినిమా వుంది మరి.! కానీ, ఇప్పుడు తన డబ్బింగ్ సినిమా కోసం ‘దిల్’ రాజు రూల్స్ మార్చెయ్యాలనుకున్నాడు.
ఏకంగా ‘వీర సింహా రెడ్డి’కీ, ‘వాల్తేరు వీరయ్య’కీ షాక్ ఇచ్చే క్రమంలో ‘ఇది యాపారం..’ అంటూ ముదర స్టేట్మెంట్లు ఇచ్చేశాడు.!
ఆ స్థాయి ‘దిల్’ రాజుకి లేదు. పైత్యం ప్రదర్శించాడు. కొవ్వు అణిగిపోయింది.! ముందే జాగ్రత్త పడ్డాడు. లేకపోతే, తెలుగు సినీ పరిశ్రమ నుంచే ఔట్ అయిపోయేవాడు
Mudra369
దిల్ రాజు ప్రముఖ నిర్మాతే కావొచ్చు.. నందమూరి బాలకృష్ణ నట సింహం.. చిరంజీవి మెగాస్టార్.! బాలకృష్ణ,
చిరంజీవి తలచుకుంటే.. ‘దిల్’ రాజుని మించిన నిర్మాతలు అవగలరు.. పంపిణీదారులుగా కూడా సత్తా చాటగలరు. చిరంజీవి, బాలకృష్ణల్లా ‘దిల్’ రాజు హీరో అవగలడా.?
Dil Raju పైత్యం ప్రదర్శించిన దిల్ రాజు..
అసలు ఈ పోలిక అనవసరం. ఆ స్థాయి ‘దిల్’ రాజుకి లేదు. పైత్యం ప్రదర్శించాడు. కొవ్వు అణిగిపోయింది.! ముందే జాగ్రత్త పడ్డాడు. లేకపోతే, తెలుగు సినీ పరిశ్రమ నుంచే ఔట్ అయిపోయేవాడు ఈపాటికి దిల్ రాజు.
‘వీర సింహా రెడ్డి’ వచ్చింది.. తెలుగు నాట సంక్రాంతి సంబరాల్ని ముందే తీసుకొచచింది. ‘వాల్తేరు వీరయ్య’ వచ్చింది.. ఆ సంబరాల్ని రెట్టింపు చేసింది.
రేప్పొద్దున్న ‘వారసుడు’ రాబోతోంది.. సినిమా బాగా ఆడితే మంచిదే.! ‘యాపారం’ అనడమే అత్యంత అసహ్యమైన వ్యవహారం.!
క్షమార్హం కానే కాదు..
అదీ స్ట్రెయిట్ సినిమాలతో డబ్బింగ్ సినిమాని పోటీ పెట్టి.. మన టాలీవుడ్ అగ్ర హీరోల స్థాయిని తగ్గించేందుకు దిల్ రాజు ప్రయత్నించిన వైనం క్షమార్హం కానే కాదు.!
లేకపోతే, విజయ్ సినిమా మీద ఎవరికైనా ఎందుకు వ్యతిరేకత వుంటుంది.? మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు కోరుకుంటారు.?
Also Read: రెమ్యునరేషన్ రచ్చ: గూబ గుయ్యిమనిపించిన మెగాస్టార్
చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలకే థియేటర్లు ఇవ్వననే స్థాయికి దిల్ రాజు అహంకారం పెరిగిపోయిందంటే.. ఏమనుకోవాలి.?
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ కొట్టిన దెబ్బకి ఆ అహంకారపు కోటలు బద్దలైపోయే వుండాలి.!