Dimple Hayathi Dishyum.. ఎంత ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ అయితే మాత్రం అంత ‘ఖిలేడీ’లా ప్రవర్తించాలా.? ముద్దుగుమ్మ డింపుల్ హయాతీ గురించి ఇప్పుడంతా ఇదే చర్చించుకుంటున్నారు.
కాదు, కాదు ఆమె చర్యలకు అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ అంత అవాక్కయ్యేంతలా డింపుల్ హయాతీ ఏం చేసిందట.? అంటారా.? అసలు మ్యాటర్ తెలియాల్సిందే అయితే.!
ఇది రీల్ స్టోరీ కాదండోయ్. పక్కా రియల్ స్టోరీ. డింపుల్ హయాతీ నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ డీసీపీ స్థాయి పోలీస్ అధికారి కూడా నివాసముంటున్నారు.
Dimple Hayathi Dishyum.. డీసీపీ కారును కాలితో తన్నిన డింపుల్.!
ఇద్దరి కార్లూ సెల్లార్‌లో పక్క పక్కనే పార్క్ చేయబడి వుంటాయ్. ఇక్కడే మొదలైంది అసలు సమస్య. డింపుల్‌పై సెక్షన్ 341, 279, 353 కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయ్.
అదేంటీ.! కేసుల వరకూ వెళ్లిందంటే విషయం పెద్దదే అంటారా.? అవునండీ.

అన్యాయంగా తన కారుని కాలితో తన్నడమే కాకుండా, తన కారుతో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తిస్తోందంటూ ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్దే జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో విచారణకు రావాలంటూ డింపుల్ హయాతీకి సమన్లు కూడా వెళ్లాయట. ఆమె పద్ధతి అస్సలేం బాగాలేదు. కారును కాలితో తన్నడమే కాకుండా, కారుతో ఢీకొట్టి డ్యామేజ్ చేయడం వంటివి చేస్తుంది.
ఎన్నిసార్లు హెచ్చరించినా డింపుల్ తన పద్ధతి మార్చుకోలేదు అంటూ సదరు ఐపీఎస్ అధికారి తన వెర్షన్ వెల్లిబుచ్చారు.
డీసీపీ అయితే నాకేంటీ.!
అయితే డింపుల్ వెర్షన్ మరోలా వుంది. ‘అధికారం ఉపయోగించి ఏ తప్పునూ ఆపలేరు..’ అంటూ తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది.
Also Read: ఎన్టీవోడూ.! నీ మనవడు మొహం చాటేశాడూ.!
ఈ ట్వీట్‌లో డిఫరెంట్ వెర్షన్స్ కనిపిస్తున్నాయ్. జస్ట్ కార్ పార్కింగ్ కోసమే డీపీపీతో డింపుల్‌కి గొడవ జరుగుతోందా.? లేక ఇంకేదైనా పాత వివాదాలున్నాయా.? అనే దానిపై చర్చ నడుస్తోంది.

మొత్తానికి ఈ ఇష్యూ మీడియా వరకూ చేరడంతో డింపుల్ పేరు మార్మోగిపోతోంది. ఈ రచ్చ ఎంతవరకూ చేరుతుందో కానీ, ఆ స్థాయి అధికారితో పెట్టుకోవడం అంటే అంత ఆషా మాషీ కాదు.
అమ్మో.! డింపుల్ మహా ధైర్యవంతురాలే.. అంటూ ఆమెకు సోషల్ మీడియా వేదికగా పలువురు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.