Disaster OG 300cr Pawan Kalyan.. సినిమా విడుదలవకముందే ‘ఓజీ డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అయ్యింది.
బాయ్‌కాట్ ఓజీ.. అంటూ, ఓ వర్గం పెద్దయెత్తున ఉద్యమానికి కూడా పిలుపునిచ్చింది సోషల్ మీడియా సాక్షిగా.! గ్యాంగ్‌స్టర్ సినిమా మేం చూడం.. అన్నారు ఇంకొందరు.
సకాలంలో, సినిమా ట్రైలర్ విడుదల కాలేదు. They Call Him OG సినిమా టీమ్ నుంచి సరిగ్గా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా లేవు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడటం తప్ప, ఓజీ గురించి హీరో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కూడా ఎక్కడా ప్రమోట్ చేసింది లేదు.
Disaster OG 300cr Pawan Kalyan.. అభిమానులు భుజానికెత్తుకున్న సినిమా ఓజీ..
పూర్తిగా అభిమానులే, ఓజీ సినిమాని భుజానికెత్తుకున్నారు. ఈ సినిమా కోసం అభిమానుల కంటే ఎక్కువగా కష్టపడింది మాత్రం దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్.
సుజీత్, తమన్.. ఇద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులేనన్న సంగతి తెలిసిందే. తమన్, తన పాటలతో సినిమాకి అవసరమైనంత బజ్ ఇచ్చిన మాట వాస్తవం.
మరోపక్క, సుజీత్.. ‘ఫైర్‌స్టార్మ్’ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అదే సినిమాకి మైనస్ అవుతుందని అంతా అనుకున్నారు కూడా.
కానీ, అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది ‘ఓజీ’.! ‘వంద కోట్ల షేర్ సినిమా పవన్ కళ్యాణ్‌కి ఒక్కటీ లేదు’ అనే విమర్శలు గతంలో చాలానే వచ్చాయ్.
ఎందుకు లేవు.? వున్నాయ్.! కానీ, లేవనే దుష్ప్రచారం గట్టిగా సాగింది. ‘హరి హర వీర మల్లు’ సినిమా కూడా వంద కోట్ల షేర్ కొల్లగొట్టింది.
‘భీమ్లానాయక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలూ వంద కోట్ల షేర్ సాధించాయి. ‘బ్రో’ సినిమా వంద కోట్లకు దగ్గరగా వచ్చిందంతే.!
ఓజీ.. మూడొందల కోట్లు.!
ఈసారి నేరుగా, 300 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డిజాస్టర్.. అంటూ ఇచ్చిన రివ్యూలు, రేటింగులు సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి.
లక్షలు, కోట్లు వెచ్చించి ‘ఓజీ’ సినిమాకి వ్యతిరేకంగా ఓ వర్గం దుష్ప్రచారం చేసినా, ‘ఓజీ’ సంచలన విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోవడం గమనార్హం.
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ కాకుండా, ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి వుంటే, ‘ఓజీ’ (They Call Him OG) సంచలనం వేరే లెవల్‌లో వుండేది.
ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాని రిలీజ్ చేసి వుంటే, 500 కోట్లు.. ఆ పైన వసూలు చేసి వుండేది ఓజీ.! అదీ డిజాస్టర్ టాక్‌తోనే.!
ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చి వుంటే, జెన్యూన్ రివ్యూలు వచ్చి వుంటే.. బాయ్‌కాట్ నినాదాలే లేకుంటే.. ‘యు/ఎ’ సర్టిఫికెట్ గనుక సెన్సార్ నుంచి వచ్చి వుంటే.?
They Call Him OG సంచలనం.. ఎవరి అంచనాలకు అందని రేంజ్‌లో వుండి వుండేది.! వెయ్యి కోట్ల లెక్క కూడా, పవన్ కళ్యాణ్ Fire Storm ముందర చిన్నదే అయిపోయి వుండేది.
