Disha Patani PROJECT K.. ఇంతకీ, ‘ప్రాజెక్ట్ – కె’ సినిమాలో ఏముంటుంది.? ‘మార్వెల్’ తరహాలో సైన్స్ ఫిక్షన్ సినిమానా.?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ – కె’. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
‘ప్రాజెక్ట్ – కె’ (Project K) సినిమా నుంచి తాజాగా, ఓ ఇంట్రెస్టింగ్ లుక్ రివీల్ అయ్యింది. హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) లుక్ అది.!
చాలా చాలా వుంది సుమీ.!
నిజానికి, ఇది మామూలు లుక్ మాత్రమే.! కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయ్. నుదుటన నిలువుగా బొట్టు.. అందులో మళ్ళీ ఓ తెల్లటి ‘డాట్’ లాంటిది. కనుబొమల మీద మళ్ళీ చుక్కలు.!

పెళ్ళి కూతురు గెటప్ అనుకోవాలా.? ఇంకేమన్నా అనుకోవాలా.? ఏమోగానీ, అందాల భామ దిశా పటానీ పుట్టినరోజు నేపథ్యంలో ‘బర్త్ డే విషెస్’ అందిస్తూ ఈ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్.
Disha Patani PROJECT K.. అప్పుడెప్పుడో.. తెలుగు తెరపైకి..
అప్పుడెప్పుడో.. చాలాకాలం క్రిందట మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరపైకి తెరంగేట్రం చేసింది దిశా పటానీ.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పేసుకుంది.!
ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగు తెరపై సరికొత్తగా సందడి చేయడానికి దిశా పటానీ సిద్ధమవుతోంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. దిశా పటానీ ‘ప్రాజెక్ట్ – కె’ లుక్.. సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోందన్నది నిర్వివాదాంశం.