బిగ్‌బాస్ బ్యూటీ దివి వద్త్య (Divi Vadthya) కు సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి పాపం అస్సలు మొహమాటపడదీ ముద్దుగుమ్మ.
ఎప్పటికప్పుడే హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కిక్కిస్తుంటుంది దివి వైద్య. తాజాగా రెట్రో లుక్స్‌లో అందాలారబోస్తూ కుర్ర హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది.
పింక్ కలర్ డిజైనర్ చీరలో దివి పాప అందాలకు పాదాక్రాంతులవుతున్నారు కుర్ర జనం. చీరే కదా అని తక్కువ చేసి చూడొద్దు సుమా.! అందులోనే వుంది అసలు సౌందర్యమంతా.
Divi Vadthya.. నీ సిగ్గు సింగారం గానూ.!
ఈ పింక్ చీరలో దివి చూపిస్తున్న అందాల కోణాలు (గ్లామర్ యాంగిల్స్) అన్నీ ఇన్నీ కావు మరి. ఎక్కడ దాచాలో అక్కడ దాచేస్తూ, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించేస్తూ కేక పుట్టిస్తోంది దివి.

అంతేనా.. మునుపంటితో పెదాలను అలా అలా కొరికేస్తూ, అక్కడక్కడా సిగ్గులొలుకుతూ మతులు పోగొడుతోంది. సడెన్‌గా సోషల్ మీడియా అంతా దివి పాప హాట్ భంగిమలతో హీటెక్కిపోయిందంటే అతిశయోక్తి కాదేమో.
ఇక, దివి కెరీర్ విషయానికి వస్తే, బుల్లి టీవీ నుంచి పెద్ద తెరకు ప్రమోట్ అయ్యిందనే చెప్పాలి. ‘గాడ్ ఫాదర్’ పుణ్యమా అని చిరంజీవితో స్ర్కీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.
‘మెగా’ ఛాన్స్‌తో మరింత జోష్..
‘గాడ్ ఫాదర్’తో దివికి మంచి పేరు దక్కింది. ప్రస్తుతం మరిన్ని సినిమాలు దివి పాప చేతిలో వున్నాయట. జోరు చూస్తుంటే, త్వరలోనే హీరోయిన్ అవ్వాలన్న అమ్మడి కోరిక కూడా నెరవేరిపోయేలానే వుంది మరి.
మరోవైపు మ్యూజిక్ వీడియోలలోనూ బిజీగా గడుపుతోంది దివి. అన్నట్లు ఈ మధ్య ‘ఏటీఎమ్’ అను వెబ్ సిరీస్‌లో కనిపించింది.
ఈ సిరీస్‌లో ఏకంగా మూతి ముద్దులతో రెచ్చిపోయింది దివి పాప. ఈ హాట్ స్పీడు కెరీర్‌లో దివిని ఎంత దూరం తీసుకెళుతుందో. ఏమో గుర్రం ఎగరా వచ్చూ.!