Dude Vs Bison Tollywood.. డ్యూడ్.. బైసన్.. రెండూ తెలుగు సినిమాలే. రెండూ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
కాకపోతే, తమిళంలో రెండూ దాదాపు ఒకేసారి విడుదలయ్యాయి. తెలుగు వెర్షన్ వరకూ తీసుకుంటే, ఒకటి దీపావళికి విడుదల కాగా, ఇంకోటి కాస్త ఆలస్యంగా విడుదలైంది.
‘డ్యూడ్’కి అదే పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. ‘బైసన్’కి అదే డిజడ్వాంటేజ్ అయ్యింది తెలుగులో.!
‘డ్యూడ్’ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరో కాగా, ‘బైసన్’ సినిమాలో ధృవ్ విక్రమ్ హీరోగా నటించాడు. ‘డ్యూడ్’ హీరోయిన్ మమిత బైజు. ‘బైసన్’ హీరోయిన్ అనపమ పరమేశ్వరన్.
Dude Vs Bison Tollywood.. ప్రమోషన్స్‌లో ‘డ్యూడ్’ దూకుడు..
‘డ్యూడ్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏ స్థాయిలో ప్రమోట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి ఓ కాంట్రవర్సీ కూడా తోడయ్యింది.
‘నీది హీరోయిన్ మెటీరియలేనా.?’ అంటూ హీరోని ఓ ఫిమేల్ జర్నలిస్ట్ తెలుగునాట నిలదీసింది. అదో పెద్ద వివాదమయ్యింది. హీరో పట్ల సింపతీ క్రియేట్ అయ్యింది.
తెలుగునాట పుట్టిన ఈ కాంట్రవర్సీ, తమిళనాట ప్రదీప్ రంగనాథన్‌కి ఓ రేంజ్‌లో అడ్వాంటేజ్ అయి కూర్చుంది. సింపతీ విపరీతంగా వర్కవుట్ అయ్యింది.
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు.. ఇద్దరూ, చెన్నయ్‌లో ఎలా తమ సినిమాని ప్రమోట్ చేసుకున్నారో, ఆ స్థాయిలోనే హైద్రాబాద్‌లో కూడా ప్రమోట్ చేసుకున్నారు.
అలా, ‘డ్యూడ్’ సినిమాకి ఇక్కడ మంచి పాపులారిటీ వచ్చింది. థియేటర్లూ కళకళ్ళాడాయి.. టాక్‌తో సంబంధం లేకుండా.
బైసన్.. ఆలస్యం, ఆపై నిర్లక్ష్యం..
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. పైగా, అనుపమ హీరోయిన్. తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో అనుపమకి బాగా తెలుసు.
కానీ, ఎందుకో ‘బైసన్’ తెలుగు ప్రమోషన్స్ విషయంలో, అనుపమకి మేకర్స్ నుంచి అంత ఫ్రీ హ్యాండ్ దొరికినట్లు లేదు.
పీఆర్ వైపు నుంచి బాగానే కష్టపడినా, నిర్మాతల నుంచి సపోర్ట్ లేకపోవడం ‘బైసన్’కి డిజడ్వాంటేజ్ అయ్యింది తెలుగులో.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఓ ప్రెస్ మీట్ పెట్టారు.. సుమతో ఓ ఇంటర్వ్యూ.. ఇవి సరిపోతాయా.? ఓ వైపు, డ్యూడ్ ఎలా ప్రమోట్ అయ్యిందో ‘బైసన్’ టీమ్ చూసుకోకపోతే ఎలా.?
వాస్తవానికి, ‘బైసన్’ పట్ల పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సరిగ్గా ప్రమోట్ చేసుకోగలిగి వుంటే, ‘బైసన్’ తెలుగులో కమర్షియల్‌గా మరింత బాగా వర్కవుట్ అయ్యేది.
కంటెంట్ పరంగా, ‘డ్యూడ్’ కంటే, ‘బైసన్’ చాలా చాలా బెటర్ సినిమా.!
