Eclipse Science Belief.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం.! ఒకప్పుడు అరుదుగా వీటి గురించి చర్చ జరిగేది. ఇప్పుడు చర్చ ముసుగులో రచ్చ నడుస్తోంది.
గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన జాగ్రత్తల్ని పెద్దలు సూచించడం మామూలే.
ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. గ్రహణ నియమాలు పాటించకపోవడం వల్లే పిల్లలు ‘గ్రహణం మొర్రి’తో పుడతారన్నది పెద్దలు చెప్పే మాట. మాట కాదు, హెచ్చరిక.
Eclipse Science Belief.. అది గ్రహణ ప్రభావం కాదు..
వైద్య శాస్త్రం ప్రకారం చూస్తే, జన్యు సమస్యల కారణంగా గ్రహణం మొర్రి కలుగుతుంది తప్ప.. దానికీ, గ్రహణానికీ సంబంధం లేదంటారు.
ఎవరి గోల వారిది.! ఏం, గ్రహణ సమయంలో తిండి మానేస్తే ప్రాణాలు పోతాయా.? మంచి నీళ్ళు ముట్టకపోతే ఏమైనా జరిగిపోతుందా.?

సినిమా టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటాం.. నచ్చిన సినీ ప్రముఖుల్ని చూసేందుకు తిండీ తిప్పలూ మానేస్తాం.. నానా కష్టాలూ పడతాం. వాటితో పోల్చితే ఇదెంత.?
రోజులు మారాయ్.. ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. గ్రహణం గురించి చాలా చాలా పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఏది మంచి.? ఏది చెడు.? అన్నది తెలుసుకోగలుగుతున్నాం.
భరించలేని స్థాయిలో మీడియా రచ్చ..
వైద్య నిపుణుల్ని, జ్యోతిష పండితుల్నీ తీసుకొచ్చి న్యూస్ ఛానళ్ళు ‘పెంట పెంట’ చేసేస్తున్నాయ్. ‘మేం, సరిగ్గా గ్రహణ సమయంలోనే తింటాం.. మాకేమీ అవదు..’ అంటాడో మహానుభావుడు. ఎందుకిదంతా.?
మూఢ నమ్మకాలు వేరు.. విశ్వాసాలు వేరు.! ఇతరులకు నష్టం కలిగించనంతవరకు ఎవరి నమ్మకం వాళ్ళది. పాటించేవాళ్ళు పాటిస్తారు, పాటించనోళ్ళ సంగతి వాళ్ళిష్టం.
Also Read: ‘డేటింగు’రంగా.! Anu Emmanuel మీద పడ్డారేంటీ.!
వేల ఏళ్ళ క్రితమే గ్రహణాల గురించి సమగ్ర సమాచారాన్ని మన పూర్వీకులు సేకరించగలిగారంటే.. ఆ పూర్వీకులు, ఆపండితులు సూచించే కొన్ని విషయాల్ని గౌరవించడంలో తప్పేముంది.?
ఆ సమయంలో అతి నీలలోహిత కిరణాలు భూమ్మీద పడతాయని సైన్స్ చెబుతోంది. అందుకే, బయటకు రాకూడదని పెద్దలు చెప్పి వుంటారు కదా.!
మిగతా సమయాల్లో కాదు, ఆ సమయంలోనే పనిగట్టుకుని బయటకు వచ్చి, అ్డడమైన గడ్డీ తింటాం.. అనే మూర్ఖులకి ఏం చెప్పగలం.?
గ్రహణమంటే, అది సూర్యుడికీ భూమికీ మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు లేదా, సూర్యుడికీ చంద్రుడికీ మధ్యన భూమి వచ్చినప్పుడూ.. కలిగే ఓ ప్రక్రియ అని సైన్స్ చెబుతోంది. అదే నిజం కూడా.!
ఏదో పాము సూర్యుడినో, చంద్రుడినో మింగేస్తోందనే మూఢ నమ్మకాల నుంచి సైన్స్ మనల్ని బయటకు తీసుకొస్తుంది.
అదే సమయంలో, ఆ సైన్స్ పేరు చేసి విపరీత పోకడలకు పోయేవారి చర్యల్నీ తప్పు పట్టాల్సిందే.