పిల్ల రాక్షసీ.! అందంతో చంపేస్తావా.? అంటూ కొందరు నెటిజన్లు తెగ బాధపడిపోతున్నారు. ఇదంతా ‘దృశ్యం’ ఫేం ఎస్తేర్ అనిల్ (Esther Anil) గురించే సుమీ.!
దృశ్యం’ సినిమాలో బాల నటిగా కనిపించిన క్యూటీ గుర్తుంది కదా. ఆ క్యూటీనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్ల రాక్షసి ఎస్తేర్ అనిల్. చిన్న పిల్లగా వున్నప్పుడే బోలెడంత నటించేసిందీ అమ్మడు.
ఇక, ఇప్పుడీ చిన్నారి పెద్దదైపోయిందిగా. ఎంత పెద్దగా అంటే, హీరోయిన్‌గా అనిపించుకునేంతలా. చైల్డ్ ఆర్టిస్టుగా వున్నప్పుడే మలయాళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అనుభవం వుంది ఎస్తేర్ అనిల్‌కి.
చిన్నప్పుడే మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అందుకే, కేరళ ప్రభుత్వం బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ అవార్డునిచ్చి ఎస్తేర్ నట ప్రతిభను ఎప్పుడో గుర్తించేసింది.
Esther Anil.. అక్కడా ఇక్కడా ఒకేసారి.!
తెలుగు దృశ్యంలోనే కాదు, తమిళ వెర్షన్ దృశ్యంలోనూ రెండు సిరీస్‌లలో ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్టుగా ఆకట్టుకునే నటన కనబరించింది. ఇక, ఇప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
తెలుగులో ‘జోహార్’ అనే సినిమాతో హీరోయిన్‌గా తొలి అడుగులు వేయబోతున్న ఎస్తేర్, సమాంతరంగా తమిళంలోనూ ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

నటన అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకోచ్చే ఎస్తేర్, ఆ ప్రేమతోనే పెరుగుతూ వచ్చిందట. ఆ ఆసక్తే ఇప్పుడు ఈ స్థాయిలో వుండేందుకు తనను ప్రోత్సహించిందని చెబుతోంది.
నెట్టింట హాట్‌నెస్ అల్టిమేట్.!
ఒక్కసారైనా హీరోయిన్ అనిపించుకోవాలన్నదే తన తపన అని క్యూట్ క్యూట్‌గా చెప్పేస్తోంది ఎస్తేర్ అనిల్. ఏముందిలే, అదృష్టం బాగుంటే, ఫస్ట్ సినిమా హిట్ కొడితే చాలు. సెటిలైపోయినట్లే.
ఓ పక్క యాక్టింగ్‌పై దృస్టి పెడుతూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఎస్తేర్ అనిల్. హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
Also Read: Ketika Sharma: టిల్లుగాని గర్ల్ ఫ్రెండ్ అట.!
తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్‌లో హాట్ అప్పీల్ అదరగొట్టేసింది ఎస్తేర్ అనిల్. ఈ గ్లామరే కదా.. హీరోయిన్‌కి వుండాల్సింది.
ఇంకేముంది అందులో తనకెలాంటి అభ్యంతరాల్లేవని ఈ పిక్స్‌తో సంకేతాలిచ్చేసిందీ బ్యూటిఫుల్. సో, పాపకి అవకాశాలు పోటెత్తడమే ఆలస్యం. చెలరేగిపోదూ.!