Table of Contents
Family Planning India Population.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. మూడోది వద్దే వద్దు.. అంటూ, సినిమా థియేటర్లలో ప్రకటనలు కనిపించేవి కుటుంబ నియంత్రణకు సంబంధించి.!
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘కుటుంబ నియంత్రణ’ అత్యంత పకడ్బందీగా అమలయ్యింది.
జనాభా పెరిగిపోతే వచ్చే సమస్యల నేపథ్యంలో, ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలవి. కానీ, దేశంలో జనాభా విస్ఫోటనం అంచనాలకు మించి కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేయగా, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం, ఆ బాధ్యతను విస్మరించాయన్న విమర్శలు లేకపోలేదు.
Family Planning India Population.. తగ్గిన హిందూ జనాభా పెరుగుదల..
మరీ ముఖ్యం, హిందూ జనాభాలో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది కుటుంబ నియంత్రణ కారణంగా. ముస్లిం జనాభా మాత్రం విపరీతంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళ నుంచి, ‘హిందువుల జనాభా పెరగాలి’ అనే డిమాండ్లు రావడం సహజమే.
మారుతున్న జీవన శైలి, ఈ క్రమంలో మనిషిని చిన్న వయసులో మింగేస్తున్న అనేక అనారోగ్య సమస్యలు.. కుటంబ వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ కారణంగా, ‘కుటుంబ నియంత్రణ’ నుంచి కొంచెం వెసులుబాటు తప్పనిసరన్న భావన ప్రభుత్వాల్లోనూ కనిపిస్తోంది.
ఇద్దరైనా.. ముగ్గురైనా ఫర్లేదు..
ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ఫర్లేదు, ముగ్గురైనా ఓకే.. అంతకు మించి మాత్రం వద్దంటున్నారు కొందరు రాజకీయ ప్రముఖులు.. అందునా, కీలక పదవుల్లో వున్నవారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ అయితే, హిందువులు ఖచ్చితంగా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలంటూ సంచలన ప్రకటన చేయడం గమనార్హం.
సహజంగానే, ఈ ప్రకటనపై విమర్శలూ వస్తుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
ఖర్చులు.. పిల్లలు..
అయితే, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన దరిమిలా, అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి చాలామందిలో కనిపిస్తోంది.
వైవాహిక జీవితాల్లో ఇబ్బందుల కారణంగా, పెళ్ళి చేసుకోకూడదనుకునేవాళ్ళూ లేకపోలేదు.
దేశ జనాభా ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, ఈ పరిస్థితుల్లో, ‘ముగ్గురు ముద్దు’ అనే నినాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఏమో.!